పనే నీది
పనే నీది
పరిస్థితులు అవగాహన..చేసుకునే పనే నీది..!
నీ తప్పులు తెలిసిసరిగ..దిద్దుకునే పనే నీది..!
అనవసరపు అవసరాలు..గుర్తించగ ఆగు సరిగ..
అంతరంగ సరిగమలను..నేర్చుకునే పనే నీది..!
పుడమికన్న అందమైన..మౌనగురువు ఇంకెవరట..
సహనమెంత కావాలో..తెలుసుకునే పనే నీది..!
గురువు కానిదేది లేదు..కన్నులెదుట గమనిస్తే..
నిఖార్సైన గురువు శ్వాస..చూసుకునే పనే నీది..!
అమ్మతనం దాచుకున్న..కణమేనోయ్ జగన్మాత..
ఆరాధన ఏమిలేదు..కాచుకునే పనే నీది..!
అణుశక్తిని విశ్వశాంతి..నిమిత్తమే వాడాలోయ్..
వ్యాపారపు ధోరణులను..మార్చుకునే పనే నీది..!
