STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

విరహపు వెన్నెల

విరహపు వెన్నెల

1 min
6


విరహపు నదిలో..దీపపు పాటవు..!
వాడని వీడని..రజనీ గంధవు..!

తరగని ఆమని..సొగసరి నీవే..
చూడగ నవ్వుల..వెన్నెల వీణవు..!

పొగడగ అందని..మౌనపు నిధివే..
కురిసే మెఱుపుల..బంగరు వానవు..!

జన్మల కథలను..తుడిపే రాణివి..
పెదవిని కదపని..చక్కని జాణవు..!

గంధపు వనమున..క్రీడకు సాక్షివి..
చెలువపు సీమను..ఏలే సఖియవు..!

కత్తుల వంతెన..ఉన్నది ఎక్కడ..
ప్రశ్నలు రాల్చగ..తోడగు ఊహవు..!



Rate this content
Log in

Similar telugu poem from Classics