అక్షర ఆరాటాలు
అక్షర ఆరాటాలు
నా సృజనాత్మక బరువుని
నేనే మోయలేకపోతున్నాను!
అక్షర దాహం నా
అంతరంగంలో అల్లరి చేస్తోంది!
ఒక్కసారి దుమ్ము విదిల్చేలా
కవితలు రాయాలనుకున్నా!
నా కలం ఏమో పిరికితనంతో
ఎక్కడో దాగుంది!
వెతికి వెతికి పట్టుకుని
కలాన్ని మెల్లగా కదిలించాను
అక్షర బిందువులు
అద్భుతంగా గుసగుసలాడాయి!
రాయటం మొదలుపెట్టాను
అక్షరాలు అస్పష్టమై
గాలిలో తేలుతున్నాయి!
ఇప్పుడే తెలిసింది
నా కవితా కలంలో సిరా
కూడా ఇంకిపోయిందని!
చేతకాని పనులను తలపోసి
నిట్టూర్పు విడిచాను!
పక్కనుండి పాత పుస్తకం ఒకటి
నన్ను విడ్డూరంగా చూసింది!
కోపంగా పుస్తకాన్ని తట్టాను
పుటలు తెరుచుకున్నాయి
నా పాత కవితాక్షరాలు
రెక్కలు కట్టుకున్నాయి!
దుమ్ము పట్టిన నా కవితలు
దుమ్ము దులిపి లేచాయి!
ఇలా!
