ఐకమత్యం.
ఐకమత్యం.
చేయి చేయి కలపడమే ఐక్యమత్యం,
ఐకమత్యమే కలిగిస్తుంది ఆత్మధైర్యం,
చేయి చేయి కలిపి ఏకమవుదాం,
స్వతంత్ర సిద్ధి కోసం పోరాడుదాం,
ఐక్యమత్యంతో ఉండాలి భారత సైన్యం,
ఆకాశంలో ఎగర వేద్దాం మన కీర్తిపతాకం,
ఐకమత్యంతో కూడుదాం,
మన దేశాన్ని స్వచ్ఛంగా మార్చుకుందాం,
ఐక్యమత్యంతో ఉంటే ఎంత పెద్ద విజయం నైనా సాధించవచ్చు,
ఏకమవుదాం ఏకమవుదాం,
భారత దేశ ప్రజలంతా ఏకమవుదాం,
భారత జాతిని గౌరవిద్దాం,
మనమందరం కలిసి ఉందాం,
ఐకమత్యమే కలిగిస్తుంది మహాబలం.
ఏకాకితనం వద్దు,
ఐకమత్యమే ముద్దు.