ఆశకు హద్ధు
ఆశకు హద్ధు
ఆశకు హద్దులేదు
ఆకాశానికి కొలత లేదు
మనసుకు నిశ్చలం లేదు
మనిషికి విలువలేదు
విలువైన వాటికి విలువలు ఇవ్వక
విలువలేని వాటికి విలువ ఇచ్చి
మనిషి సాటి మనిషికి ద్రోహం చేస్తున్నాడు
మనుషులం ఆండీ మనం
కన్నీళ్ళకు విలువ నివ్వాలి
కష్టాలకు తోడు నిలవాలి
అవసరానికి సాయం చెయ్యాలి
కాని నిజానికి సాయంచేసిన వారికి ద్రోహం చెయ్యడమే నేటి మానవుడి ఆట అందుకే
మనుషుల్లో స్వార్థం పెరిగింది సాయం చేసిన చేతిని
తెగనరికే జనం ఉంటుంటే మనిషి మనిషిగా కాక స్వార్థ పరుడిగా మారుతున్నాడు తన కోసమే తాను జీవిస్తున్నాడు
నమ్మితే నమ్మకం ద్రోహం చేస్తుంటే మనిషి మనుగడ కష్టం కాక మంచిగా ఎలా ఉంటుంది
అవసరానికి సాయం పొందడమే కాదు
ఎదుటి మనిషికి అవసరమైతే సాయం చేయగలిగితే
అప్పుడు నీవు మానవీయత నిండిన మనిషి
