ఆరు ఋతువుల కాల చక్రం - కవితా
ఆరు ఋతువుల కాల చక్రం - కవితా


ఆరు ఋతువుల కాల చక్రం - ఋతు గమనం { కవితా గీతం }
పల్లవి : ఆరు ఋతువుల కాల చక్రం - ప్రకృతి కాంత తిలక రత్నం
పవన మారుత వీవనక్రమం - జీవన చలిత మలయ సమీరం
|| ఆరు ఋతువుల కాల చక్రం ||
చరణం ౧. చైత్ర మాస వికసిత వసంతం - మది పులకిత సోయగం
హృదయ రమ్య చలిత విశాఖం - వెచ్చ వెచ్చని గ్రీష్మ తాపం
వర్ష ఋతువున మృత్తికా ఆఘ్రాణం - పాడి పంటల గతి అనంతం
ధరణి ఇచ్చిన ఫలిత మది స్వీకృతం - ప్రకృతి అందాలే పరమ పావనం
|| ఆరు ఋతువుల కాల చక్రం ||
చరణం ౨ భాద్రపదమున గణేశ కీర్తనం - నవరాత్రి గతిని చూపే భక్తి భావం
ఆశ్వయుజము న శక్తి స్మరణం - ఆకాశాన చంద్రికల కాంతి కిరణం
కార్తికాన కోటిదివ్వెల ఆశా ప్రకాశం - ధనుర్మాస రాధా మాధవం
చక్ర భ్రమణ త్వరిత కాల గమ్యం - శీతల పవన హేమంతం
|| ఆరు ఋతువుల కాల చక్రం ||
చరణం 3 హేమంతంలో వసంతం , శిశిరం లో చైత్రం - ప్రకృతి కాంత పులకిత జీవనం
త్వరిత ఋతు కాల గమనం - సకల జనుల విహారం ఆహ్లాద కరం
లోగిళ్ల భోగం,సంక్రాంతి లక్ష్మి ఆహ్వానం - శిశిరంలో రంగుల వలయం
కాముని దహన వసంత కుమార సంభవం - ఈ ఋతువుల చక్ర భ్రమణం
|| ఆరు ఋతువుల కాల చక్రం ||
@@@@@@@ కవీశ్వర్ .
కే. జయంత్ కుమార్
రాజేంద్రనగర్ . హైదరాబాద్.