ఆప్తులతో వేడుక
ఆప్తులతో వేడుక


అందరికి మిత్రులు ఎంతో అవసరం,
ఎదో ఒక సమయమున కావాలి వారి సహకారం |౧|
చిన్న వయసులో వారితో ఉండెను ఆటలు పాటలు,
పెద్దయ్యాక తీపి జ్ఞాపకంగా ఉండిపోయెను ఆ మాటలు |౨|
ఏ రోజు కలిసినా అనిపించెను కొత్త దినం,
స్నేహం పాత అవుతున్నకొద్దీ వచ్చెను కొత్తదనం |త్రీ|
చాలా కాలం అనంతరం మరువం ఆ వింత పరిహాసాలు,
ఎప్పుడు మాట్లాడుకున్న మారవు చిన్ననాటి పరిసరాలు |౪|
కలిసి భోజనం చెయ్యడం కలిగించెను ఆనందం,
ఒకరి తో ఒకరు పంచుకుని తినటం ఇచ్చెను పరమానందం |౫|
కోరుకోరు ఒకరికి ఒకరు బహుమతులు,
కేవలం కోరుకొనెను తెలుసుకొనుటకు పరస్పర విషయాలు మద్దతులు |౬|
ఒక అలౌకిక సంతోషం ఇచ్చెను ఆప్తులతో వేడుక,
మనసు ఎదురు చూసేను ఆగామి వేదిక |౭|