ఆనందం
ఆనందం
పద్యం:
పసిడి గలిగిన తనువవడు దేవేంద్రుడు
వేలధనములున్న విలువ రాదు
ఆశవిడ్చి బతుక నానందము దొరుకు
బుద్ధి ధాత్రి దివ్య భారతాంబ!
భావం:
బుద్ధి ని ధరించిన దివ్యమైన రూపం గల పుస్తకమాతా (సరస్వతీ)! శరీరము నిండా బంగారం ధరించినప్పటికి అతడు భగవంతుడు కాలేడు, ఎన్ని వేల ధనములు ఉన్నప్పటికీ వారికి విలువ రాదు, కాబట్టి ఆశ ను విడిచిపెట్టి జీవనం సాగిస్తే జీవితం ఆనందమయం.