Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Classics Fantasy Others

4  

VENKATALAKSHMI N

Classics Fantasy Others

ఆమె..ఓ అద్భుతం!

ఆమె..ఓ అద్భుతం!

1 min
235



ఆమె..ఆకాశమంత అద్భుతం

వినీలాకాశమంత మనసు కలిగి

అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుది


ఆమె.. వర్షించే నీలిమేఘం

కదిలిస్తే చాలు కంటి మేఘం

జలజలా వర్షించి తీరుతుంది


ఆమె..తళుకుమనే నక్షత్రం

కానరాని కడగండ్లెన్నున్నా

కాంతులీనే వదనం ఆమె సొంతం


ఆమె..కాంతి పుంజం

అవరోధాలను అవలీలగా

అధిగమించి దూసుకుపోయే

ప్రభాత కిరణం


ఆమె..కమ్మని కౌముది

చల్లని వెన్నెలలారబోస్తూ

మదిమదినీ దోచుకుని

పరవశింప జేస్తుంది


ఆమె.. మండే అగ్ని గోళం

నిప్పులు చెరుగుతూ

నిజాలను ఎండగట్టి

భస్మం చేస్తుంది


కానీ..కానీ.. ఇవేవీ కాని

శూన్యమంటి ఆకాశమే ఆమె

అందుకే..ఆమె..

ఓ..అద్భుతం..



Rate this content
Log in

Similar telugu poem from Classics