STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy

5.0  

ARJUNAIAH NARRA

Tragedy

ఆమె నాకేం ఇచ్చింది

ఆమె నాకేం ఇచ్చింది

1 min
570

ఆమె నాకేం ఇచ్చింది 

వసంత పువ్వుల నవ్వులను తనకు రువ్వి 

నాకు గ్రీష్మం మృత ఆకుల కన్నీళ్లను పోసింది

మెత్తని పూరేకుల సోయగం తనకిచ్చి 

వాడి పాడై ఎండిన కాయాన్ని నాకు ఇచ్చింది


ఆమె నాకేమీ ఇచ్చింది 

సుఖసంతోషాలు తనకిచ్చి 

దుఃఖాలు నాకు తెచ్చింది 

గులాబీ పువ్వులను తనకు పంచి 

ముళ్ళతో నా గుండెను గుచ్చింది 

పరిమళాలను తనకు వెదజల్లి 

రోత కంపును నాకు పుసింది


ఆమె నాకేమి ఇచ్చింది

మైదానంలో సారం తనకు ఇచ్చింది 

బంజరు భూముల్లోని రాళ్లను నాకు ఇచ్చింది 

జీవరసములను నలిపి మత్తును తనకి ఇచ్చి

నా ఎదపై తన్ని నాకు గుండెపోటుని ఇచ్చింది


ఆమె నాకేమీ ఇచ్చింది 

వర్షాకాలంలో వెచ్చని కౌగిలి తనకి ఇచ్చింది 

వేసవిలో వేడి గాలిని నాకు పంపింది 

వెన్నెల్లో వన్నెలన్నీ తనకి ఇచ్చింది 

వికార మృతదేహాన్ని నాకు ఇచ్చింది


ఆమె నాకేమీ ఇచ్చింది 

పరికిణిని తనకు పాన్పుగా చేసింది

పరిగ కంపను నా ముందుకు తోసింది

ముద్దు మురిపాలు తనకు ఇచ్చింది

ముండ్ల బాటను నాకు పరిచింది


ఆమె నాకేమీ ఇచ్చింది

ఆమె నాకు చేదు జీవితాన్ని ఇచ్చింది 

నన్ను అగ్నిపర్వతం చేసింది 

నన్ను నేను దహించుకునేల చేసింది 

నా గుండెల్లో ఎండమావులు పూయించింది

నా జీవితాన్ని సర్వనాశనం చేసింది 


ఆమె నాకు దుఃఖం ఇఛ్చిన దూరం చెయ్యను

నాకు బాధలను పంచిన బదితురాలను చెయ్యను

నా ఖ్యాతిని కీడెంచినా, సమాజంలో నన్ను దూషించిన

ఆమెను దుఃఖపు దారుల్లో వదిలి వెయ్యను

ఆమె నాకేమీ ఇచ్చిన, 

నేను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy