STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Inspirational

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Inspirational

ఆదర్శ దంపతులవుదాం

ఆదర్శ దంపతులవుదాం

1 min
515

నీలిమేఘాలలో దాగున్న నీటి తుంపరవా?

నా మీద నీ ప్రేమ జల్లు కురిపించావు

వర్షపు చినుకులకి మొగ్గగా తొడిగే శక్తివా ?

నీ శక్తితో నా ప్రేమ అణుశక్తిని రగిలించావు

ఆల్చిప్పలలో దాగున్న మేలిమి ముత్యానివా?

నాలో కానరాని పదాల గనిని

వెలికితీసే కవిని పుట్టించావు  

మాఘమాసంలో మత్తుని వెదజల్లే మాలికావా? 

నేను నడిచే దారుల్లో సంతోషాల మాలలు పరిచావు 

ఎగిసిపడే సంద్రం మాటున తీరం చేరని అలవా ?

నీ జాడ ఎక్కడ....నేలపైన..... నింగిలోన .....


ఎందుకు .......

నేను వద్దనుకున్నప్పుడు ప్రతిక్షణం వెంటాడుతావు

నేను కావాలనుకున్న మరుక్షణం మాయమౌతావు 

నేను నీతో కలిసి జీవించాలని ఆశిస్తున్నా .....

నాలుగు దిక్కుల ఈ లోకాన 

నీ దిక్కు నేనవుతా 

నా చుక్కానివి నీవే అవ్వు 

రా... ప్రియా..... రా ...

నన్ను తీగలా అల్లుకో

ప్రేమతో పెనవేసుకో


మన ఇద్దరం కలిసి .......

మంచులా కరిగి కడలి ఒడికి ప్రవహిద్దాం

గాలిలో సుగంధంలా మన ప్రేమను విస్తరిద్దాం

విహంగాలమై గగనతలంలో విహరిద్దాం 

కవి కలం నుండి జాలువారి ప్రేమికులకు లేఖలవుదాం

పిల్లనగ్రోవి నుండి కమనీయమైన సంగీతమవుదాం 

గాయకుల గాత్రం నుండి గేయంగా ఆలపించబడుదాం


నవజాత శిశువు పెదవంచున చిరునవ్వు అవుదాం 

పసిపాప పెదవుల్లో పాలనురగవుదాం

పడుచు కన్య కన్నుల్లో తెల్లవారుజాము కలలవుదాం

నవ వధువు లేత బుగ్గలపై సిగ్గు చుక్కనవుదాం

రసిక రతి మన్మధుల వక్షముపై చిరు చెమటవుదాం

ముదుసలి ముఖం ముడుతల్లో  

చరమంకపు చరితవుదాం 


నిశ్శబ్దపు స్మశానంలో ...............

మచ్చలేని ప్రేమికులకు సాక్ష్యాలవుదాం....

మమతానురాగాలకు నిర్వచనాలవుదాం .....

ఆలుమగల అనురాగాలకు గుర్తులవుదాం ......

రాబోయే రేపటి తరాలకు ఆదర్శ జాడలవుదాం...

          ******

సుదూరం నుండి సమీరం 

సినీ గీతాన్ని లీలగా మోసుకొచ్చింది 

చినుకులా రాలి .......నదులుగా సాగి ......

వరదలైపోయి........ కడలిగా పొంగు .......

నీ ప్రేమ..... నా ప్రేమ ......

నీ పేరే....... నా ప్రేమ......

 నదివి నీవు....... కడలి నేను....... 

మరిచిపోబోకుమా....... మమత నీవే సుమా !



Rate this content
Log in

Similar telugu poem from Romance