STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

ఆడపిల్ల

ఆడపిల్ల

1 min
343

అమ్మగా ప్రేమను పంచే

ఆడపిల్లను అలుసుగా చూడకు


చెల్లిగా మమతానురాగాలు కురిపించే

ఆడపిల్లను 'ఆడ' పిల్లేనని అవహేళన చేయకు


అలిగా సర్వ సపర్యలు చేసే ఆడపిల్లను

అపహాస్యం చేసి మాట్లాడకు


పరాయి ఇంటికి వెళ్లే పిల్ల ఆడపిల్ల ని

కిరాయి మాదిరి చులకన చేయకు


అవనికి వెలుగులు పంచే ఆడపిల్ల

చల్లని చూపే శ్రీరామరక్ష అని తెలుసుకో


పాలిచ్చి పెంచే తల్లిగా నే కాదు

పాలించి చూపే సత్తా గలది ఆడపిల్ల


సృష్టికి మూల బిందువు ఆడపిల్లని

జగతి ప్రగతికి పట్టుకోమని గ్రహించు


ఆడపిల్లలు పుట్ట నివ్వండి బతకనివ్వండి

ఆడపిల్లలను రక్షించండి సృష్టిని కాపాడండి



Rate this content
Log in

Similar telugu poem from Tragedy