STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

"దేవుడు చేసిన మనుషులు"

"దేవుడు చేసిన మనుషులు"

1 min
1.5K

పైకి నవ్వుతూ లోపల ఏడ్చవాడు ఒకడు

ముందు పొగుడుతూ వెనుక తిట్టేవాడు మరొకడు

మంచిని కోరుతూ చెడును ఆపాదించువాడు ఇంకొకడు

అవసరానికి కొమ్ముకాస్తు, అది తీరాక వెన్నుపోటు పొడిచేవాడు వేరొకడు

మనిషి బుద్దే వంకరైనప్పుడు,

సంపాదనకే ఆ మనిషి దాసోహమైనప్పుడు

చుట్టమెవడు... చుట్టుపక్కనెవడు...

స్నేహితుడెవడు... సన్నిహితుడెవడు...

ప్రతోడు దొంగ దెబ్బ తీసేటోడే...

ఆపై కంట్లో నలతై మెదిలేటోడే...

ఎందుకో ఆ సృష్టికర్త...

ఈ మనుషులకు అతి తెలివినిచ్చి,

తప్పు.. తప్పు.. అసలు తెలివినిచ్చి తప్పు చేశాడనిపిస్తుంది.

అభం శుభం తెలియని ఆ జంతువుల్లానైనా,

తప్పు.. తప్పు.. ఆ జీవుల్లానైనా పుట్టిస్తే బాగుండనిపిస్తుంది.

కుళ్ళు కుతంత్రాలతో అనుక్షణం ఏడ్చి చచ్చే..

దేవుడు చేసిన ఓ సాటి మనిషి...

నీది ఓ బ్రతుకేనా..? ఆ బ్రతుక్కి విలువెక్కడిది..?

దానికన్నా తక్షణం తనువు చాలించడం మేలు కదయ్యా..!

తద్వారా ఆ క్షణమే "జేజేలన్నా" దక్కేవి..!!

ఇక్కడ నేను,

మనుషులను జంతువులతో పోల్చితే, వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయో లేదో చెప్పలేను కానీ,

జంతువులను, మనలాంటి "మానవ మృగాలతో" పోల్చితే మాత్రం వాటి మనోభావాలు తప్పకుండా దెబ్బ తింటాయని చెప్పగలను.

మరలా క్షమించాలి...

మృగాన్ని కూడా మానవులతో పోల్చినందుకు!

- సమాజ తీరుతో...

 విస్తుపోయిన ఓ స్వేచ్చా "విహంగ"ని



Rate this content
Log in

Similar telugu poem from Abstract