Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Praveena Monangi

Inspirational


4  

Praveena Monangi

Inspirational


పితృదేవోభవ

పితృదేవోభవ

1 min 309 1 min 309

            

గుప్పెడంత గుండె గూటిలో ఆశల సౌధాన్ని నిర్మించుకుని..

కంటికి రెప్పలా రేయింబవళ్లు తన బిడ్డలకు కాపలాదారి వలె...

తన పిల్లల కోరికలు తీర్చే అల్లా ఉద్దీన్ అద్భుత దీపం వలె...

తన బిడ్డల కష్ట కాలం లో రక్షణ కవచము వలె...

తన పిల్లల ఆనందములో ఒక చిరునవ్వు వలె...

తన బిడ్డల ఆలనాపాలనలలో ఒక సేవకుడి వలె..

తన పిల్లల విద్యార్ధి దశ లో ఒక గురువు వలె...

తన బిడ్డల భవిషత్ కార్యాచరణకు ఒక ఆదర్శవంతుని వలె...

తన పిల్లల నిస్సహాయ స్థితులలో ఒక స్నేహితుని వలె...

కష్టాలు,నష్టాలు ,కన్నీళ్లు తన పిల్లలకు పంచని స్వార్ధపరుని వలె..

తన గుండె చప్పుడు లో మాత్రమే తన బిడ్డలకు చోటిచ్చే పిసినారి వలె..

తాను కరుగుతూ తన బిడ్డల జీవితాలలో వెలుగు నింపుతూ...

అహర్నిశలూ శ్రమించే మహోన్నత వ్యక్తి నాన్న
Rate this content
Log in

More telugu poem from Praveena Monangi

Similar telugu poem from Inspirational