జైజవాన్
జైజవాన్
వంతెనగా తనతనువును..నిలిపినాడు..జైజవాన్..!
దేవునికే ప్రతిరూపమై..నిలచినాడు..జైజవాన్..!
మనసు రాయి చేసుకున్న..మాంత్రికుడే సైనికుడా..
ఒక రక్షణ యంత్రంలా..ఒదిగినాడు జైజవాన్..!
కాపాడే తత్వానికి..ప్రతీకగా ముందుండును..
విపత్తులకు ఎదురీదగ..సాగినాడు జైజవాన్..!
ఎంత చరుకుతనము వాని..సొంతమోయి గమనిస్తే..
సమయానికి తగుశక్తిగ..ఎదిగినాడు జైజవాన్..!
జీతానికి కాకతాను..తన నేనును విడనాడెనె..
తనకమ్మని జీవితాన్ని..ఇచ్చినాడు జైజవాన్..!
