STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ మనిషి

ఓ మనిషి

1 min
2



ఎప్పటకీ కలవని సమాంతర రేఖల 

వెంబడి నీ పయనమా ?

అగమ్యగోచరమైతే గమ్యం ఎలా

 కలల తీరం చేరేదెప్పుడూ..?

 ఆరాటాలు ఆశలు ఎంతగా ప్రతిధ్వనించినా

 మబ్బులు కమ్మిన ఆకాశంలో పున్నమి వెన్నెల ప్రకాశించేనా?

 వెతల నిశీధి దట్టంగా కమ్ముకుని కలలన్నీ కల్లోలమైన

 బ్రతుకులో ఈ చీకటి 

వీడిపోయి కాంతి రేఖలు ప్రసరించేనా?

 బ్రతుకు బాటలో నిత్య పోరాటమే,

 కరిగే కాలంలో ఎన్నెన్ని మజిలీలో !

బాధించే ఘటనలు ఎన్నో 

వీడిపోని జ్ఞాపకాలు ఎన్నెన్నో 

మదినిండా కొన్నిటికి ఆలస్యమైనా 

వీడ్కోలు తప్పదు 

మౌనం నుండే ప్రశ్నలు ఉదయిస్తాయి 

సమాధానాలు దిశగా అడుగులు పడతాయి 

కొంత తడబడినా బలీయమైన త్రోవ 

నీకై కనిపిస్తుంది;

కఠినమైనా నిర్ణయాలు బాధించినా 

తలరాతలు మార్చే జీవిత గీతలు 

మారిపోవా ?

నేడు మనసును బాధించి ఆలస్యమై 

బరువైన నేటి వీడ్కోలు,నిశబ్దమైనా 

రేపటి వేకువలలో వెలుగురేఖవై 

ప్రకాశించవా ?


Rate this content
Log in

Similar telugu poem from Classics