నీ కోసం
నీ కోసం
మోహాల కోయిలలు...
నిన్ను చూసిన అద్భుత దృశ్యాల్లో మదిన,
వలపు గీతాలు వయ్యారంగా పలుకుతాయి.
మోమున పురివిప్పిన ప్రణయ గతుల్లో,
అనురాగాలు పూల చినుకులై కురుస్తాయి.
జఘనం కప్పుకున్న త్వచాల కోమల మడతల్లో,
ప్రణయపు మేఘాలు ప్రేమాకాశంలో కదలాడుతాయి.
సొబగులన్ని కలిసిన కరాల అంగుళీకాల్లో,
ప్రేమ సందేశాలెన్నో మౌనంగా ప్రసారమౌతాయి.
నాభిలో కదలాడు గాలి ఊసుల సవ్వడుల్లో,
కౌగిలి బంధనాల గంధాలు అందంగా పూసుకుంటాయి.
శృంగార రసాల మేల్కొలుపు కవ్వింతల్లో,
ఎద ఎదలు రాపిడిలో సెగలను రాజేసుకుంటాయి.
అందమైన అంగాంగ మది పాడే వర్ణనల్లో,
నాకవితలు గాఢంగానిన్నేహత్తుకుంటాయి.
పెనవేసుకొనే భావ సంవేదనలలోతు గదుల్లో,
నా హృదయం నిండా నీ ఊసులే విప్పుకుంటాయి.
ప్రణయ తీరాలు దాటే వయసు ఉప్పెంగే తడిలో,
కోటి రాగాలు పలికే మోహపు కోయిలలు నీ కోసం రాగాలు తీస్తాయి.

