STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ముద్దులు

ముద్దులు

1 min
1



నుదిటిపై పెట్టేముద్దు 
ఆరాధనను తెలియచేస్తుంది,
చెక్కిలిపై పెట్టేముద్దు 
తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది,
అధరపు ముద్దు మోహాలచెంత నిలబెడుతుంది,
హద్దులు దాటని ముద్దే 
మనసును మనసును 
ఏకం చేస్తుంది.

భాషలేని పదములతో 
ప్రేమను పలికిస్తుంది ముద్దు,
అనుబంధపు పాన్పుపై 
గిలిగింతల రాగం అవుతుంది ముద్దు,
స్వచ్ఛమైన చెలిమిలో 
పెదవిచాటు మౌనంగా వుంటుంది ముద్దు,
పెనవేసుకున్న హృదయాలకు 
వలపుల తలపౌవుతుంది ముద్దు,
ముద్దులరోజు వేళ 
కనిపించక నడిపించే ప్రేమేకదా ముద్దు.

జీవితమంటే ఆటకాదు 
పంచగల్గు ఆత్మీయతే సత్యమైన ముద్దు,
విరహంలోనూ సంస్కారం కోల్పోని 
సత్ శీలతే ముద్దు,
అద్భుతమైన ప్రేమలో 
కలగా ఊరించేదే 
అసలుముద్దు,
సప్తపదుల బాటలో 
ప్రేమను వర్ణించే ముద్దును 
వర్ణించ భాషలేకపోవడమే ముద్దు


Rate this content
Log in

Similar telugu poem from Classics