మరి
మరి
చీకటి వెలుగుల సద
స్సుల్లో సందెలు చేసే సందడుల్లోనేనెక్కడో ..మరి
మసక వెన్నెలమాగాణా
ల్లో మధువిచ్చే మత్తు
మరపులోతానెక్కడో.....మరి
కైరవిఎంతగ ఊరించినా నే రేబవళ్ళ ఉచ్ఛ్వాస నిశ్సాస
మై నిలిచా
ప్రేమ సరాలెన్నో ఉసిగొలిపి
నా సాంత్వన లేని గమకాల నీవెక్కడో... మరి
చెలిమి చెలమతోగుండె గొంతు తడుపని
ఎండమావుల రేవుల మావులలో చిక్కి
తీరునో తీరదో తెలియ
ని తీరని దప్పిలోన బండలై మీరెక్కడో... మరి
తృష్ణ ఏదో తృప్తి ఏదో
తెలివి తెరగేదో తెలియ
క నే తిరుగుతున్నాగా ప్రాయాలాటలో ఆనంద
మిచ్చె ఇష్టాయిష్టాలెరు
గని జనమెక్కడో....మరి
