నిశ్శబ్దము
నిశ్శబ్దము
నడి వీధిని తిరుగుతున్న
వీడనంది నిశ్శబ్దము……..!
అంతరాన సంద్ర ఘోష పంచనంది నిశ్శబ్దము……..!
కఠినమైన వాస్తవాన్ని ఒప్పలేని తీరుచూసి…….
చెవులున్నా మూగలాగ మిగలమంది నిశ్శబ్దము…….!
తనవారిని అందలమే ఎక్కించగ జంకబోరు…….
పిల్లి లాగ పాలు తాగి వుండమంది నిశ్శబ్దము……!
వేళు నెత్తి తప్పులనే వెతుక బోవు నడత చూచి…….
మూడు వేళ్ళు నీ వైపని మరవకంది నిశ్శబ్దము……!
ఎగుడుదిగుడు సోపానము చీకటింట నడక సాగె…….
ప్రకాశాల బాట పట్టి సాగమంది నిశ్శబ్దము……!!
