రవి కిరణాలు
రవి కిరణాలు
మసిలే ఆలోచనలో
ముసురుతున్న కారుమబ్బులు
కాసంత విచ్చుకుంటున్న
జ్ఞానోదయపు రవికిరణాలు
సంధ్యా సాయంత్రం వేళలో
ఏకధాటిగా ఉతికారేస్తున్న
అంతర్మధన వెర్రి భావాలు
అభినయ దర్పణంగా
ఏవో రాస్తున్న పిచ్చి రాతలు
నేను కవిననుకుంటూ
అర్థం కాని ఓ సందిగ్ధంలో
అజ్ఞాతంగా ఎవరో పగలబడి
నవ్వుతుంటే అలా చూస్తున్న
అయోమయంలో పిచ్చిగా...!
