రవ్వనీ
రవ్వనీ
తెల్ల తెల్లాని రంగేళి రవ్వనీ
చూడ చూడంగ నాదేలె జవ్వనీ
మెల్ల మెల్లంగ రాజీకు రమ్మనీ
పోరు పెట్టేసు కుంటాను నాదనీ
కుసుమ నయనాల వయ్యారమే
మనసు దోచేయు నయగారమే
తేనె అధరాల తరుణీమణీ
తలపు తాకేను హిమపాతమై
రజనీ నీరజ రంజిత కోమలము
గంగా నీరన పావన తోయదము
ఖలమే మేఖల ఖండిత రాజసము
నటనే నేనట నన్నది నీజవము
శ్వేత వస్త్ర ధరం దేవీ సునయనీ
మేఘ వర్ణ వేణి రాణీ సుభాషిణి
హాస్య లాస్య మోము తోడుగ సులోచని
జట్టు కట్ట నేను జంట సౌధామిని
