చూపులతో
చూపులతో
చూపులతో పెనవేసిన బంధాలను తెలుపలేను
తూపులతో గురి చూసిన మార్గాలను వెతకలేను
హంస ఎలా నేర్వకుందొ నీ నడకలొ సోయగాన్ని
నీ పాదం ముద్రలలో ఆందాలను విడువలేను..
కోకిలతో స్వరము కలిపి పాడుటయే ఎందుకిలా?
శిష్యులుగా గంధర్వుల గానాలను తూచలేను
కలువలెన్ని విరిసినాయొ! నిన్ను కనుల చూద్దామని
కొలువలేని వరములలో రాగాలను చూడలేను
మయూరమే నాట్యమాడి మోకరిల్లె నీ ముంగిట
నృత్య రీతి తాను రాగ తనను నేను గెలువలేను.
