మజానోయ్
మజానోయ్
ఊపిరిసలపని పని..ఉండడం మజానోయ్..!
మనసును ఖాళీగా..ఉంచడం మజానోయ్..!
ఆరోగ్య రక్షణకు..తలమునక లెందుకట..
అనుభవాల సాక్షిగ..కదలడం మజానోయ్..!
ఆవేశం మంచిదే..సమావేశ మవసరం..
అవినీతిని నిలువున..కాల్చడం మజానోయ్..!
సమభావం నిలిపే..చదువదే అద్భుతం..
కులమత ఛాందసాలు..కూల్చడం మజానోయ్..!
మధుశాలకు వెళ్ళే..కాళ్ళనెలా ఆపడం..
గురుతత్వ ద్రాక్షరసం..గ్రోలడం మజానోయ్..!
ఉద్యోగ మేదైనా..సద్యోగం దొరికెనా..
శ్వాసనిలిపి హాయిగా..బ్రతకడం మజానోయ్..!
