అలసి సొలసి విశ్రమించే వేళ
అలసి సొలసి విశ్రమించే వేళ
ఆధునికత అంతర్నాటకంలో
మనసు సంకుచితమై
మనుగడ స్వలాభమై
చెట్టు మోడు వారక మునుపే
నరికివేసే విషసంస్కృతి
చాపక్రింది నీరులా విస్తరించి
పేగు బంధాన్ని ప్రేమ బంధాల్ని
తరలించేస్తున్నాం వృద్ధాశ్రమాలకు
మన అధోగతికి నిదర్శనంలా …..
ఎండకు నీడై వానకు గొడుగై
చీకటిలో వెలుగై ఆపదలో తోడై
పిల్లల ఉజ్వల భవితకై
నిస్సారమైన తల్లిదండ్రులు
అలసి సొలసి విశ్రమించే వేళ
పండుటాకులా రాలే వేళ
పలకరింపే పన్నీటి జల్లుగా
పట్టేడన్నమే పరమాన్నముగా
కడపటి వీడ్కోలు వరకు
కాసింత కరుణ (రుణం)చూపుదాం ….
కాలచక్ర భ్రమణంలో రేపటి
వృద్ధ్యాప్య వారసులమేగా ……
