STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

హేమంతం

హేమంతం

1 min
0



నులివెచ్చని గీతాలకు..ఆలంబన హేమంతం..! 
పంతాలకు సెలవిచ్చే..ఆచ్ఛాదన హేమంతం..! 

రవికిరణపు మధురిమలో..తేలించే రసజ్ఞయే..
నవజీవన రహస్యాల..ధారాంగన హేమంతం..! 

సరసాగ్నిని రగిలించే..ఆరాధనా నిధానయె.. 
సంక్రాంతుల స్వాగతించు..తారాంగన హేమంతం..! 

హరిదాసుల సంకీర్తన..వినిపించే తేజోనిధి.. 
మంచుపూల తేనె సాక్షి..మేఘాంగన హేమంతం..! 

అక్షరాల నిజబంగరు..చేమంతుల మందహాసం..
ఈ మాయను దాటించే..శ్వాసాంగన హేమంతం..! 

విష్ణుతత్వ ధారామణి..విశ్వమైత్రి వినోదినియె.. 
బ్రహ్మకమల తీర్థాకర..సత్యాంగన హేమంతం..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics