మరనీ తీరు
మరనీ తీరు
బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, స్వార్థం పట్టుకుని వేలాడుతారు, అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, లోపల ఒకటి పెట్టుకుని పైన తీయటి మాటలు కురిపిస్తారు, ఎంతో ప్రేమలు ఉన్నట్టు నటిస్తారు, లోలోపల కుళ్ళు కుతంత్రాలు శాపనార్థాలతో మునిగిపోతారు, వారికి విలువనివ్వరు కోపాలు తాపాలు కక్షలతో రగిలిపోతారు, సూటు పోటు మాటలతో చిత్రవధ చేస్తారు, పోయాక ఇక్కడ లేని ప్రేమలో చూపిస్తారు, గుండెలు పగిలేలా ఏడుస్తారు, ఉన్నప్పుడు పట్టించుకోరు కానీ పోయక రావాలి రావాలి అంటూ దిక్కులు అరిచేలా ఏడుస్తారు, డబ్బు ప్రపంచంలో మనుషులకు విలువ కరువైంది, బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది, బతుకు ఆటలో ఆశతో జీవిస్తూ స్వార్థంతో పరిగెడుతున్నారు, ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని మనిషి చనిపోయాక ఆత్మ శాంతించాలని కోరుకుంటాడు ఇదే లోకం తీరు ఇదే మనుషులకు తీరు
