మధురమే
మధురమే
మాటతీయన మనసు మెత్తన పలుకులన్నీ మధురమే
పొగడ్తలకూ లొంగిపోవని మలుపులన్నీ మధురమే
నిండుపున్నమి. వెన్నెలంతా. జలధికన్నెకు. ఆటలే
కోరికలతో పుడమి తడిపిన గురుతులన్నీ మధురమే
మొయిలు మబ్బును కాంచినంతనె నెమలికన్నెకు నాట్యమే
చినుకులోనా. చిందువేసిన. రోజులన్నీ మధురమే
అబల ఆరవ. ప్రాణమీవే. కరుణచూపుము కాంతపై
కలలలోనా ప్రాణసఖునీ వలపులన్నీ మధురమే
రాగమున్నది శ్యామ కొరకే శ్వాస ఉన్నది సఖుని కొరకే
కడలిఅలలా మాటునున్నా పిలుపులన్నీ మధురమే..
