కలువబాల
కలువబాల
ఎంత చక్కటి గొడుగోయమ్మ,
కలవబాల అంటేనే నీవమ్మా.
ప్రేమనదిలో తానమాడే బుజ్జమ్మా
నీ నవ్వుల్లోనే
అనురాగపు కోవెల ఉందమ్మా,
పూల పరిమళరాగంతో
అల్లుకునే మనసే నీదమ్మా
పాటలనది పరుగులాగా
నాట్యమే చేయవమ్మా,
మదివీడని తలపుగా కనిపించేవమ్మా
కాంతిపూల తీగతో మనసుదోచిన
కలువబాల నీవమ్మా.
దైవకోవెలలో నీపుష్పపీఠం పదిలమమ్మ
అనుబంధపు రాజ్యానికి మహారాణివి నీవే కావాలమ్మా,
ఆనందపు మూలనిధి
నీలో దాగేనమ్మా
వాడిపోని వికసిత పద్మమై అమృతస్నేహం పంచవమ్మా,
అలిగిపోయే కోకిలగా వుండకమ్మా
నీతోనే వసంతం వుండాలమ్మా,
ప్రలోభాలకు లొంగని నడతతో
సుందర సుమధుర భావాల
కావ్యమై నీవు
అవనిలో నిలవాలమ్మా.
