నా కలం
నా కలం
"నా" కలం కార్చు కన్నీటి అక్షరాలు
విరహగీతికలు..!!
"నా"కలం వెదజల్లు చిరునవ్వుల అక్షరాలు ..!!
ప్రేమ గీతికలు..
"నా" కలం చిందించు రక్తాక్షరాలు
విప్లవ గీతికలు..!!
"నా"కలం లిఖించు శిలాక్షరాలు
శాసనాలు...!!
"నా"కలం పంచు చిలిపి అక్షరాలు..!!
"నా"కలం తెలిపే పడుచు హృదయ స్పందనలు..!!
"నా"కలం ఒలికించు హాస్యాక్షరాలు
హాస్యావల్లరులు..!!
"నా"కలం విదిలించు అస్త్రాక్షరాలు
చెడు గుండెల పిడి బాకులు..!!
"నా"కలం బుజ్జగించు ప్రేమాక్షరాలు
ఎదన చేరి ఓదార్పును ప్రేమ నిండిన హృదయాన్ని..!!
అందుకే పలుకుతుంది
క్షరం కానీ అక్షరం అక్షయం "నా"కలం..........!!!!!!!!
