STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

మేలుకో

మేలుకో

1 min
7


తూరుపమ్మ నీ చెంతకొచ్చి 

వెచ్చంగా చెంపల్ని నిమిరి

మగత ను వదలమని పదేపదే లేలే లెమ్మని

ఉదయ రాగం పాడుతుంటే .....

ఇంకా నిద్రావస్త ఏల , లే లే 

మనసు కనే కల నుంచి 

ఇలకు ఎగిరే పావురంలా 

మాయ నిద్రంతా ఎగిరిపోగా.... లే లే 

రేపటి వెలుగు చెట్టుకు అగ్ని పూలు పూయింపగ

కల ఇక మానుకొని మెలకువ తెచ్చుకొని

వెలుగు రేఖలు పట్టుకొని , జీవితాన్ని వెలిగించగ


నిన్న ను నిక్షిప్తం చేస్తూ

నేటి నడక ను శాసిస్తూ 

ఊహల జగతి ఉనికిని వెతుకుతూ

ఆశల ఆచూకి చిరునామా తెలుసుకుంటూ


చీకటి నుంచి వెలుగు వైపు

అశక్తత నుంచి శక్తి తీరం వైపు

నిర్వేదం నుంచి చైతన్య దీపం వైపు

తమ సోమా జ్యోతిర్గమయమని

మేలుకో ... జగతి కి ఆకాశ దీపంలా

అంతు చిక్కని మౌన రణం నుండి

మనసును నిర్వీర్య పరిచే అంతర్యుద్ధం నుండి

పునర్వ్తేజితుడవుతూ ..

కల ఇక చాలని ... మెలకువ మేలని

మేలుకో ..... నీ జీవితాన్ని నీవే ఏలుకో

నిన్నటి కలలకు కొత్త ఆశలదీపాలు వెలిగిస్తూ

బతుకు పాఠాలతో మైత్రీబంధం నెరపుకుంటూ

నీలోని శోకాన్ని ' గీతాశ్లోకం ' తో ప్రక్షాళన చేసుకొంటూ


కల ఇక చాలని 'మెలకువ' మేలని ...

రేపటి వెలుగు చెట్టుకు అగ్నిపూలు పూయించుకుంటూ ...

మేలుకో ... మెలకువ తెచ్చుకో ...




ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar telugu poem from Classics