వందనం
వందనం
ఎగురుతున్నది మువ్వన్నెల కీర్తిపతాకం.
దేశ సమైఖ్యతకి అది తలమానికం.
మహాత్ముల త్యాగానికి అది త్యాగఫలం.
ధైర్యానికి ప్రతీక అయిన కాషాయవర్ణం.
సత్యానికి చిహ్నమయిన శ్వేతవర్ణం.
ప్రగతికి ప్రతిరూపమైన హరితవర్ణం.
స్వతంత్ర భావాన్ని ప్రతిబింబించే,
విజయధ్వజానికి భరతమాత ముద్దుబిడ్డల వందనం
