ప్రథమభాష
ప్రథమభాష
తెలుగుభాష ప్రథమభాష..లేనిబడులు దేనికి..!?
తెలుగుదనం రక్షించని..తెలుగుజనులు దేనికి..!?
గిడుగువారి పేర చూడ..ఉత్సవాలు చక్కగ..
తెలుగువేర్లు కాల్చివేయు..గొప్పవిభులు దేనికి..!?
కందుకూరి గురజాడల..సంస్కరణలు ఎన్నో..
పాలుత్రాగి రొమ్ముకోయు..సంస్కారులు దేనికి..!?
విశ్వనాథ కృష్ణశాస్త్రి..శ్రీశ్రీలను తలతురు..
కవితాత్మను పట్టలేని..కవితిలకులు దేనికి..!?
ఎవ్వరినీ చదవకుండ..వ్రాస్తున్నవి ఏవో..
విలువలన్ని దిగజార్చే..పుణ్యాత్ములు దేనికి..!?
డబ్బో అధికారమొ పలుకుబడో తోడేలా..
ప్రశ్నించే గొంతునులుము..మహరాజులు దేనికి..!?
