పనేం లేదు
పనేం లేదు
దేశానికి ఎవరేదో..చేయాల్సిన పనేం లేదు..!
తమ సమయం..ఏకొంచెం..పెట్టాల్సిన పనేం లేదు..!
ఎవరివంతు కర్తవ్యం.. వారు తెలిసి చేయటమే..
యుద్ధాలకు కాలేదో..దువ్వాల్సిన పనేం లేదు..!
శాంతి సామరస్యతలను..కాపాడే ధర్మమేదొ..
తెలియకే జండా ఎగురవేయాల్సిన పనేం లేదు..!
అహింసా సిద్ధాంతపు..మూలమేదో అందకుండ..
ఊరకనే విమర్శలను..విసరాల్సిన పనేం లేదు..!
చిరునవ్వుతొ హృదయాలను..గెలవడమే..
సత్యమంటె విశ్వమైత్రి..చెప్పాల్సిన పనేం లేదు..!
