పేద రైతు పాన్పు
పేద రైతు పాన్పు
స్వచ్ఛమైన ప్రకృతిస్నేహం సుకృతమేలే,
పేదరైతు లోగిలి తరువే
అమ్మఒడిగా మారెనులే,
సౌఖ్యాలకై తపియించని వెర్రిమనసు
నిదురలో మెలుకువనే వెంటనిలుపుకొనులే,
ఆనంద గగనపు
స్నేహసుమ పరిమళం వాడిపోనిదిలే,
ప్రకృతిపంచేటి స్వచ్ఛసంపద అనుభవించువాడే భాగ్యవంతుడులే.
చిరుగాలి సవ్వడే
అమ్మజోలపాటగా వినిపించి నిదురబుచ్చులే,
రైతు మనసుమెచ్చు సిరిసంపదలు తలవాకిట నిలిస్తే సుఖశాంతులకు
కొదువ వుండదులే,
ప్రతీజీవిలో దేవుడిని చూసేటి రైతన్నకు
ప్రతీ బీజపు దరహాసం కనిపించులే,
ప్రకృతిని చదివే శక్తే
అనంతునికి వేదమంత్రమై వినిపించునులే,
వైభోగమో ప్రకృతమ్మను వీడలేని అనుబంధమో
ప్రతిభావన పండించు కలలపంటేల
