మన ముందు తరం
మన ముందు తరం
ఓటమిని ఒరిమితో ఎలా
జయించాలో నేర్పిస్తుంది,
ఒత్తిడిని ఎలా
ఓడించాలో నేర్పిస్తుంది,
గాలి గమనాన్ని బట్టి
వర్షంను ఎలా అంచన
వెయ్యాలో నేర్పిస్తుంది,
పకృతిలో ఎలా
మమేకం కావాలో
నేర్పిస్తుంది,
బంధాలను ప్రేమతో
ఎలా బందించాలో
నేర్పిస్తుంది
ఎలా నడవాలో నేర్పిస్తుంది
ఎలా జనంలో కలవాలో నేర్పిస్తుంది
అదే అదే పాత తరం
అనుభవాల అద్భుత భండగరం
మమతలు కురిపించే మన ముందు తరం.
