భారత్
భారత్
తల ఎత్తుకు గర్వంగా నిలబడింది మన భారత్...!
చంద్రునిపై దక్షిణాన నిలబడింది మన భారత్...!
శాస్త్రఙ్ఙుల మేథస్సే నిను నిలిపే జయ పతాక
అడుగడుగున సాధనతో కలబడింది మన భారత్...
ఆర్యభట్టు,మిహిరుడుగా... మన చరితకు ఆనవాళ్ళు..
ఆ దారిని సుగమంగా కనబడింది మన భారత్...
అసాధ్యాన్ని సుసాధ్యంగ చెయునదే భరత భూమి
తన శక్తితొ , తన యుక్తితొ అడుగిడింది మన భారత్..!
విజయ రంగవల్లులనే దిద్దేందుకు కృషి సల్పెను......
చంద్రయాను .. సఫలంతో బల పడింది మన భారత్...!..!
