మాలిన్యపు మనసు
మాలిన్యపు మనసు
పొయ్యికాదు ఇది
మాలిన్యం నిండిన మనసుచిత్రంలే,
కనిపించని మార్గంలో గ్రుచ్చుకొనే ముళ్ళే ఇవిలే,
మనసాకలి సేదతీరడమే చూడలేములే,
ఏడుపుగొట్టు మనుషుల
కంటపడక తిరగడం బ్రహ్మవిద్యేలే,
కసిపెంచుకున్న కల్మషహృదయం
ఉషోదయం చూడలేదులే,
శ్రుతితప్పిన రాగాలు
మధురగీతాలు పల్లవించలేవులే,
వెలుగువైపు అడుగులేయడం
తెలియనివారు
వేదనల తోడు వీడలేరులే,
పొగలు కమ్ముకున్న ముఖానికి
విషవాయువులే నేస్తాలగునులే,
వివేకం కోల్పోయిన వారికి
దుఃఖమే మనసు ఊసుగా మారునులే,
కోపతాపాలు విషాదాగ్ని రగిలిస్తే
ప్రేమలే బూడిదగా మారునులే,
అహంకారం గెలుపుద్వారాలు తెరువలేదులే,
బాధలగాథలు
తిట్లుగా వినిపిస్తుంటే
ఆశలేవో ధ్యాసలేవో తెలియునులే,
వ్యర్థపు తలపుల తపనల తాకిడికి
అసూయే ఇంధనములే,
జీవితమనే నాటకాన
ప్రతీపాత్రతో నటించడం నేర్వాలిలే.
