పల్లెలు
పల్లెలు
మన పల్లెలోనే వెల్లివిరిసేను
అనురాగపు సిరులు ఆత్మీయ విరులు
వచ్చిపోయే చుట్టాల సందడులు
మనసు నిండా ఆనందాలు
మనసారా పలకరించే ఇరుగు పొరుగులు
ఆకాశాన్ని అంటే తాటి చెట్టుల ఆపేక్షసిరులు
కనపడితే కళ్ళతోనే ఆనందం వ్యక్తపరిచే
మూగజీవాలు ప్రకృతి అంతా ప్రశాంతం
హృదయములో నిండెను అమృత భాండం
గాదిలో ధాన్యాలు పెరటిలో గడ్డివాములు
పచ్చ పచ్చని వనాలు పరవశించే జనాలు
ఎంతో అద్భుతమైనవి పల్లె బతుకు చిత్రాలు
హృదయానందపరిచే ఉద్యానవనాలు
ఒకరితో ఒకరు పంచుకునే భావాలు
పెంచుకునే అనుబంధాలు
పుణ్యం చేసుకుంటేనే పుడతాము పల్లెటూర్లలో
సాఫీగా సాగిపోయే జీవన విధానం
నల్లేరు మీద నడకలా హాయి గొలిపే
ఆనంద జీవితం
పెట్టి పుట్టాలి పుట్టి పెరగాలి పల్లెటూర్లలోనే
మారిపోయిన చిత్రాలు మారని ఆలోచనలు
ఎంతైనా మనసు గెంతుతుంది
పల్లెల వైపుకి పైనిద్దామని ఆశగా
ఆఖరి రోజుల్లో నైనా
మన ఊరిలో ఉందామని తృప్తిగా...
