STORYMIRROR

T. s.

Tragedy Others

4  

T. s.

Tragedy Others

శిధిల శిల్పం

శిధిల శిల్పం

1 min
1.2K

రాలిన ఆశలకి వెలిసిన ప్రేమలకి తావు లేని హృదయం ఇది...

గడిచిన స్వప్నంలా మనసు ఖాళీ గా ఉంది.

నిశ్శబ్దం నివురు గప్పిన నిప్పులా నీలుగుతుంది...

శిధిలమైన విషాదం కలల వీధిలో తాండవిస్తుంది

స్మృతులు శిధిలాల క్రింద నలిగి గుండె చూరుకు వేళ్ళాడుతున్నాయి...

కాలం చేసిన గాయాలు రోదిస్తూ పరుగులు పెడుతున్నాయి.

కాలచక్రం గీతలు గీస్తూ రివ్వున ఎగిరెళ్ళింది.

విషాదపు నీలినీడల్లో పయనించే శిధిల శిల్పం ఈ మనసు ...

సర్వం నశించిన వైరాగ్యం అంటుకోని (దేహం)ఆలయం ఇది...


Rate this content
Log in

Similar telugu poem from Tragedy