kishore dasika

Fantasy

3  

kishore dasika

Fantasy

వ్యామోని-విలేకరి

వ్యామోని-విలేకరి

10 mins
230



ఈ కథని కల్పిత కథ గా భావించి, చదవండి.


ఈ కల్పిత కథను వాస్తవ సంఘటనలకు,Mythology కి ముడి వేసి రాసిన కథ


కొన్ని యుగాల కిందట 


ఇంద్రుడు తన సభలో అతిధులుగా ఉన్న దేవతలకు కనులకు పండుగా కలిగించాలనే ఆలోచనతో అప్సరసలను సభకు రప్పించుకుంటాడు.

అప్సరసలు నృత్యాలు చేస్తుంటారు.ఆ అప్సరసలలో ఉన్న వ్యామోని అనే అప్సరసను చూసి ఇంద్రుడు తన ఏకాంత గదికి పిలుపునిస్తాడు. అప్పుడు ఆ అప్సరస ఇంద్రుడి వద్దకు వెళితే. 


ఇంద్రుడు వ్యామోనిని చూసి తనకి ఒక బాధ్యత ని అప్పచెబుతాడు. 

ఆ బాధ్యత ఏమిటంటే ధ్యాస ఋషి యొక్క ధ్యాస, నీ వైపు తిప్పుకుంటే కావాల్సిన ఐశ్వర్యం ఇస్తా అని అంటాడు . అలాగే ఇంద్రుడు చెప్పిన విధంగానే ధ్యాస ఋషి ని తన అందంతో తన వైపుకి తిప్పుకుంటుంది. 

ఇంద్రుడు, వ్యామోని కి అతి త్వరగా ముగించుకున్న పనికి మెచ్చి, ఎంతో ఐశ్వర్యంని ఇస్తాడు.దానితో వ్యామోని అందరి అప్సరసల కన్నా గొప్ప ఐశ్వర్యవంతురాలు అవుతుంది.


ఇంద్రుడు, వ్యామోనిని తన పై చెడుగా ప్రచారం చేసే వాళ్ళ మీద ప్రతికారం తీర్చుకోవడానికి ఈ వ్యామోనిని అడ్డుగా పెట్టుకుని పగ తీర్చుకుందామనుకుని. 


ఒకనాడు వ్యామోనిని తన సభకు పిలుస్తాడు.అప్పుడు వ్యామోని శరీరం నిండా ఆభరణాలతో దర్శనం ఇస్తుంది. 


ఇంద్రుడు, వ్యామోనిని చూసి మై మరిచి తనతో రాత్రి గడుపుతాడు. అలా రాత్రి గడిపినందుకు వ్యామోని తనకి దేవత పదవి కావాలనే కోరిక కోరుతుంది. అప్పుడు ఇంద్రుడికి ఆమె అడిగిన కోరిక విచిత్రంగా అనిపించి వ్యామోని అడిగిన కోరికను తిరస్కరిస్తాడు. 

అప్పుడు వ్యామోని పెద్దగా నవ్వి.......

ఇంద్రుడి కళ్ళ ముందు నుంచి ఒక ఎర్రటి పండులా ఉండే యంత్రాన్ని తీసి ఇంద్రుడికి చూపించి.

"ఇందులో మీ రాసలీలలు ఉన్నాయి, ఎంతో మంది అప్సరసలను బలాత్కరించిన విధానం ని ఈ యంత్రం సహాయంతో చిత్రీకరించ "అని తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న వరమైన దివ్యదృష్టి తో ఇంద్రుడికి ఆ దృశ్యాలను చూపిస్తుంది. అప్పుడు ఇంద్రుడు ఆ దృశ్యాలను చూసి, ఆశ్చర్యం తో పాటు ఆలోచన కూడా వస్తుంది. 


ఆ దృశ్యాలను చూసిన ఇంద్రుడు వ్యామోని కాళ్ళ పై పడి "వీటిని ఎవరి కి చూపించకు, నిన్ను అప్సరసని కాస్త, ఐశ్వర్య అప్సరస గా మార్చింది నేనే, నికు కావాలి అనుకుంటే ఇంకా ఐశ్వర్యం ఇస్తా"అని అంటాడు. 


అప్పుడు వ్యామోని "ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న మీరు మీ మాట పై నిలబడతాను అంటే మీకు ఒక సాయం చేయాలనుంది ఏదైన కోరుకోవండి" అని అనగానే. ఇంద్రుడు "నాకు చేసిన విధంగానే ఋషులను, దేవతలను బెదిరించు.వాళ్లకు ఉన్న సంతోషాన్ని, ఇష్టాలని లాక్కొ "అని అంటాడు. అప్పుడు వ్యామోని"దీని వలన మీకు ఉపయోగం ఏమిటి "అని అడగగా. ఇంద్రుడు "నాకు ఏ లాభం ఉండదు. కాని నేను, నిన్ను ఎప్పుడు అయితే చూశానో, ని వ్యామోహం లో తేలుతూనే ఉన్నాను,నిన్ను ఒక మహా రాణి లా చూడాలి అది కూడా వ్యామోహానికి రాణి ఈ వ్యామోని అప్సరస అవ్వాలి "అని అంటాడు. అప్పుడు వ్యామోని "దానికి నేను చేసె పనికి అర్ధం ఏమిటి "అని అడగగా ఇంద్రుడు ముందు, ముందు నీకె తెలుస్తుంది అని అనగానే వ్యామోని సరే అని ఇంద్రుడు చెప్పిన పనిని చేస్తుంటుంది. అందరూ కూడా ఈ వ్యామోని అనే వ్యామోహం లో తేలుతూ ఈమె కు పూర్తిగా బానిసలుగా మారుతుంటారు. 


కొన్ని రోజులకి వ్యామోని దేహం లో ఉన్న ఒక్కో శరీర భాగం మాయమవుతుంటుంది. అప్పుడు వ్యామోని, ఇంద్రుడు దగ్గర కి పరుగు పరుగున వెళ్లి తనకి జరుగుతున్నది చూపిస్తుంది. అప్పుడు ఇంద్రుడు వ్యామోనికి ఏమైందని దివ్యదృష్టి తో చుస్తే వ్యామోని కి ఒక ఋషి పెట్టిన శాపం వలన ఇలా జరుగుతోందని తెలుసుకుని, వ్యామోని కి తెలియజెప్పుతాడు. వ్యామోని చాలా దుఃఖం గా ఉండి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రుడు "దినికి పరిష్కారం నువ్వు చేసె పనే, నీలా చేసె వాళ్ళ వలనే నికు విముక్తి లభిస్తుంది. దానికి నువ్వు త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం లో ఉన్న 20వ శతాబ్దానికి ప్రయాణం చేస్తూ, నీ కున్న విలువలను పెంచుకుంటుంటావు. కాని ఇక్కడ సమస్య ఏమిటంటే నువ్వు ఎవరినైతే పట్టుకుంటావో వాళ్ళ కి మాత్రమే ఇతరులపై వ్యామోహం కలిగి పేరు ప్రతిష్టలు తెస్తారు. కాని నిన్ను ఎవరు గుర్తు పెట్టుకోరు, అసలా నువ్వు ఉన్నావనే విషయమే ఎవరికి తెలియదు "అని అంటాడు. 


వ్యామోని మాయమవుతుంది.......


ప్రస్తుత యుగం 


ప్రస్తుత సమయం 


ముంబాయి :


ఒక బిల్డింగ్ లో ఉన్న 505 ఫ్లాట్ లో ఒక 26 ఏళ్ళ అమ్మాయి కారిడార్ లో నుంచుని సూర్యోదయం ని ఆస్వాదిస్తుంటుంది. 


ఈలోపు తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వెంటనే హడావిడిగా బయటకి భుజం పై హ్యాండ్ బ్యాగ్ వేసుకుని,డోర్ లాక్ చేసి పరుగులు తీసిన వెంటనే ఆ ఫ్లాట్ లో ఉన్న గ్యాస్ బండ పేలుతుంది. ఈమెను కొంతమంది చుట్టు ముట్టి కారులో ఎక్కిస్తారు. 


ఈమెను అలా కారులో తీసుకుని వెళుతూ ఒక దగ్గర దింపి వెళిపోతారు. 


ఒక క్షణం తనకి ఎమ్ జరుగుతొందో అర్ధం కాదు అప్పుడు ఒక చిన్న పాప సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటుంది. అప్పుడు వసుందర ఆ పాప ని చూసి "సంధ్య"అని ఆ పాప వద్దకి పరిగెత్తుకుంటూ వెళ్లి "నువ్వు ఈ టైం లో హాస్టల్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు "అని అడుగగా ఆ పాప వసుందర నుంచి తప్పించుకుని పారిపోతుంది.వసుందరికి ఎమ్ అర్ధం కాదు తన కూతురికి ఏమైందో అని ఆ పాప వెనుక పరిగెడతాది. 


ఒక నిర్మానుషమైన ప్రదేశం 


వసుందర పాప వెనుక పరిగెడుతూ ఒక నిర్మానుషమైన ప్రదేశం కి వెళ్లి సంధ్య, సంధ్య అని గట్టిగా అరుస్తుంటే. 

అమ్మ అంటూ ఒక పిలుపు వస్తుంది. 


కొద్ది నిమిషాలకి 


ఒక ముసలతను వసుందర పాపతో వసుందర కళ్ళకి ప్రత్యక్షమవుతాడు. 


అతను వసుందరని చూసి "నేను ని పాపని ఏమి చెయ్యను. నువ్వు నేను చెప్పిన పని చేస్తే. అలాగే నేను చేపిన పని చేస్తే, నువ్వు కోల్పోయిన విలేకరి వృత్తి ని నీకు తిరిగి అప్పచెబుతాను. నువ్వు చేయవలసింది ఏమిటంటే. కోదండాపురం లో మొగవాళ్ళు కనబడుటలేదు అంట, అక్కడ ఆడవాళ్లు నగ్నం ఊరిలో తిరుగుతున్నారు మొగవాళ్ళ రాక కోసం. ఈ వార్త తెలిసాక నా మనుషులను పంపించా,దాదాపు ఐదు సంవత్సరాలు అయినది వాళ్ళు తిరిగి రాలేదు. నువ్వు ఆ ఊరు వెళ్లి అక్కడ ఎమ్ జరుగుతొందో తెలుసుకుని రావాలిఅంత వరకు ని పాప నా వద్దనే ఉంటుంది. అని నాలుకతో సంధ్య బుగ్గని రాస్తే. వసుందర కి కోపం వచ్చి తన ఆత్మ రక్షణగా తెచ్చుకున్న గన్ తో ఆ ముసిలతనని కాలుస్తుంది. అతను మరణిస్తాడు. అప్పుడు ఆ పాప అమ్మ అంటూ వసుందర వద్దకి వస్తుంది. వసుందర ఏడుస్తూ, సంధ్యని ముద్దులాడుతుంటుంది. ఈ లోపు ఆ మరణించిన అతని జొబ్బులొంచి ఒక రేగు పండు కలర్ లో గుండ్రంగా ఉన్న ఒక వస్తువు, వసుందర వద్దకి దొర్లుకుంటూ వస్తుంది. వసుందర ఆ వస్తువుని చూసి, బ్యాగ్ లో పెట్టుకుని తన కూతురుని తీసుకుని అక్కడ నుంచి వెళిపోతుంది. 


ముంబాయి బీచ్ 


వసుందర, సంధ్యకి ఐస్ క్రీమ్ కొని ఇచ్చి, "నేను వస్తేనే ఎక్కడికైనా వెళ్ళు, అందరి మనుషులు మంచోళ్లు కాదు "అని చెప్పి తనని హాస్టల్ లో డ్రాప్ చేస్తుంది. అప్పుడు సంధ్య "అమ్మ, నన్ను ఎప్పుడు ని వద్దకి తీసుకుని వెళ్తావ్ "అని అడగగా. వసుందర "త్వరలోనే కన్నా "అని నుదిటపై ముద్దు పెట్టి వెళుతుంది. 


మరుసటి రోజులు 


వసుందర ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. ఎదురుగా ఒక బ్రొకెల్ హౌస్ ఉంటుంది. వసుందర రోజు తన ఇంటి వద్ద ఉన్న కిటికి లొంచి ఆ హౌస్ వైపు చూస్తుంటుంది. మొగవాళ్ళు, అక్కడున్న ఆడవాళ్ళని కాళ్ళ తో తొక్కే సంఘటనలని చూసి భావోద్వేగానికి లోనై పక్కనే ఉన్న బల్ల పై తన చేతిని గట్టిగా ఆన్చుతుంది. అప్పుడు వసుందర బ్యాగ్ లో ఉన్న రేగు పండు లో ఉన్న వస్తువు కింద పడుతుంది. వసుందర దానిని చూసి గమనిస్తే అది ఒక స్పై కెమెరా అని తెలుసుకుని, ఆ ముసలతను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని కోదండాపురంకి బయలుదేరుతుంది. 

మార్గం మధ్యలో ఒక పిల్లోడు వసుందర బ్యాగ్ ని దొంగిలించి పరిగెడుతుండగా, వసుందర ఆ పిల్లోడి వెంట పరిగెడుతుంది. 


కొద్ది సమయం గడిచాక 


ఒక దగ్గర ఆ పిల్లవాడు బ్యాగ్ ని కిందపాడేసి, ఎక్కడికో వెళిపోతాడు. అప్పుడు వసుందర ఆ బ్యాగ్ తీసుకుని వెనుకకు తిరిగి చూస్తే ఒక పెద్ద వెలుతురు వస్తుంది. ఆ వెలుతురుకి వసుందర కళ్ళను మూసుకుంటుంది. 

కొద్ది సమయానికి ఆ వెలుతురు తగ్గుతుంది అప్పుడు అక్కడ ఒక బస్సు ఉంటుంది. దాని పై కోదండాపురం అని రాసి ఉంటుంది. అప్పుడు వసుందర వెంటనే ఆ బస్సు ఎక్కుతుంది. వసుందర ఎక్కిన వెంటనే చాలా మంది జనం ఎక్కుతారు, ఆ బస్సు కొద్ది సమయానికి బయలుదేరుతుంది. 


ఎంత సేపటికి కండక్టర్ టికెట్ తీసుకొవడికి వచ్చేవాడు కాదు. అలా కండక్టర్ కోసం ఎదురు చూస్తు వసుందర ఒక కునుకు తీస్తుంది..... 


కొద్ది నిమిషాలకి :


వసుందరికి మెలుకువ వస్తుంది, ఆ బస్సు లో జనాలు ఎవరు ఉండరు. వసుందరకి అనుమానం కలిగి నెమ్మదిగా అడుగు వేస్తు డ్రైవర్ దగ్గరకి వెళితే, డ్రైవర్ ఉండడు కాని బస్సు కదులుతుంటుంది... 


ఆ బస్సు లో వసుందర తప్ప ఎవరూ ఉండరు. వసుందరకి భయం వేసి బ్యాగ్ నుండి రేగు పండు లో ఉన్న కెమెరా తో రికార్డు చేస్తు,బస్సు కిందకి చూస్తే బస్సు రోడ్డు మీద ప్రయాణం చేయదు, ఆకాశంలో ఎగురుతుంటుంది...... అది చూసిన వసుందరకి కళ్ళు తిరిగి అలా బస్సు సీట్ లో కూర్చునిపోతుంది,స్పృహ తప్పి. 


వసుందర ఎక్కిన బస్సు సుదీర్ఘ ప్రయాణం ఆకాశంలో తేలుతూ చేస్తుంటుంది. 


కొద్ది సమయానికి 


బస్సు రోడ్ మీద ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. 

కళ్ళు తిరిగి స్పృహ తప్పిన వసుందరకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి. ఆ బస్సు నిండా జనం ఉంటారు. 

అప్పుడు వసుందర ఆశ్చర్యంతొ ఆ జనాలందరినీ తాకుతుంటుంది, వసుందర కదలికలను చూసిన ఆ బస్సు కండక్టర్ "అమ్మ ఎమిటి ప్రాబ్లెమ్ కూర్చోండి "అని అంటాడు. అప్పుడు వసుందర ఉలిక్కి పడి అతని వైపు చూసి, రేగు పండు లో ఉన్న కెమెరా తన సెల్ కి కనెక్ట్ చేసి, రికార్డు చేసిన వీడియోని చూపించి. "ఈ బస్సు లో ఎవరు లేకుండా నేను ప్రయాణం చేసాను, అసలేం జరుగుతోంది "అని గొంతు వణుకుతూ అంటాది. 

అప్పుడు ఆ కండక్టర్ "అంతా మీ భ్రమ అమ్మ, కూర్చోండి ప్రశాంతం గా "అని అంటాడు. 

అప్పుడు ఇక వసుందర ఎమ్ చేయలేక ఆ వీడియోని చూసుకుంటూ కుర్చుంటుంది. 


కొద్ది సమయానికి 


వసుందర దిగ వలసిన ఊరు వస్తుంది, బస్సు ఆగుతుంది. 

బస్సు లోంచి వసుందర దిగుతుంది ;బస్సు వెళిపోతుంది. 

అలా బస్సు దిగిన వసుందర, ఆ ఊరిలోకి నెమ్మదిగా అడుగులు వేయడం మొదలు పెడుతుంది. వసుందర అలా అడుగులు వేస్తుండగానే చీకటి పడుతుంది. అప్పుడు వసుందర తెల్లవారు జామున ప్రయాణం ముందుకు కొనసాగిద్దామనుకుని చుట్టు పక్కల ఉన్న చెట్టు కొమ్మలని విరిచి, పోగుగా చేసి మంట పెట్టుకుంటుంది. ఆ వెలుతురులోనే కాసేపు నిద్రిస్తుంది. 


ఒక గంట తరువాత.... 


వసుందరకి మెలుకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు. 


అప్పుడు వసుందర "గంట కూడా అవ్వలేదు అప్పుడే రాత్రి నుంచి మధ్యాహ్నం అయిపొయిందేమిటి "అని ఆశ్చర్యంగా మొఖం పెట్టి ఆ చలి మంట వైపు చూస్తే, ఆ మంట పువ్వుల తోటలా మారడం గమనించిన వసుందర భయంతో కొంతదూరం పరుగులు తీసే సరికి మళ్ళీ చీకటి అవుతుంది. 


దూరంగా నక్కల అరుపులు, కీచ్ , కీచ్... మంటూ పిట్టలు, కుక్కురుకో అంటూ కోడి శబ్దాలు వసుందర చెవులకి విన్పిస్తుండడం తొ, వసుందర తన రెండు చేతులతో చెవులను మూసుకుని. ఆ శబ్దాలు తగ్గగానే కొన్ని కొమ్మలని నరికి చలిమంట కాచుకుంటూ అలా మెలుకువ గానే ఉంటుంది. 


కొద్ది నిమిషాలకే మళ్ళీ ఆ ప్రాంతం తెల్లవారు జాము అవుతుంది. అప్పుడు ఆ చలిమంట చీమల పుట్టగా మారుతుంది. 


అలా మారడం గమనించిన వసుందర చిన్నగా నవ్వుతుంది. నెమ్మది, నెమ్మదిగా వసుందర ఆ వాతావర్ణoకి అలవాటు పడుతుంది. 


వసుందర తెచ్చుకున్న తిండి, వస్తువులు నాచు పట్టి పాడైపోతాయి. వసుందరకి చాలా దాహం వేస్తుంటుంది. సమయం ఎంత అయిందో అని సెల్ ఫోన్ తీసుకుని చూస్తే;ఆ సెల్, వసుందర చేతి మీదే పేలిపోతుంది. వసుందర ఒక్కసారిగా ఎగిరి చెట్టుకి గుద్దుకుని కింద పడితే, వసుందర జోబులో ఉన్న రేగుపండు కింద పడుతుంది. 

వసుందర స్పృహ తప్పుతుంది.... 


కొన్ని గంటలు ఆ ప్రాంతం అంతా చీకటి, ఉదయం, మధ్యాహ్నం లా మారుతూ ఉంటుంది. 


మద్యాహ్న సమయం లో వసుందరకి మెలుకువ వస్తుంది. 


నెమ్మది, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఒక చిన్న పాప నగ్నంగా నుంచుని వసుందర వైపు చూడడం గమనించిన వసుందర "ఎవరు నువ్వు, ని అమ్మ నాన్న ఎక్కడా "అని అడుగుతుంటే. ఆ చిన్నపాప రేగు పండు కెమెరా ని చూస్తు ఉంటె. 

వసుందర "నేను ఇక్కడ మాట్లాడుతుంటే కిందకి చూస్తావేంటి "అని లేచి ఆ పాప వద్దకు వెళుతుంటే. ఆ పాప ఆ రేగు పండు కెమెరా తీసుకుని పరిగెత్తడం గమనించిన వసుందర, ఆ పాప వెనుక పరిగెడుతుంది. 


అలా ఇద్దరు కొంత దూరం వేగంగా పరిగెడుతూ ఒక దగ్గర ఆగుతారు..... 


వసుందర ఆయాస పడుతూ "ని చేతిలో ఉన్నది నాకు ఇచ్చేయి "అని అంటె. అప్పుడు ఆ పాప వసుందర వద్దకు వెళ్లి ఆ రేగు పండు ని వసుందర చేతిలో పెట్టి, ఆ పాప చేతి వేలితొ ఒక వైపు చూపిస్తుంది. 


వసుందర ఆ పాప చూపించిన వైపు చూస్తే అక్కడ ఒక చెట్టు కింద వందల మంది ఆడవాళ్లు నగ్నంగా కుర్చుని ఏడుస్తుండడం చూసి భయంతో వెనుకకి అడుగు వేస్తె. ఆ చిన్నపాప గట్టిగా అరుస్తుంది. 


అప్పుడు ఆ వందలాది నగ్నంగా ఉన్న ఆడ వాళ్ళు వసుందర వద్దకి పరుగు పరుగున వెళ్లి చుట్టు ముడతారు..... 


వసుందర వాళ్ళ వైపు ఆశ్చర్యoగా చూస్తుంటుంది... 


వసుందరిని చూసిన నగ్నంగా ఉన్న ఆడ వాళ్ళందరూ వాళ్ళ బాధలని చెబుతుంటే, వసుందర భయంతో చెవులు మూసుకుంటుంది 


కొద్ది సేపటికి 


వసుందర, వాళ్ళ కళ్ళలోంచి వచ్చే కన్నీళ్ళను చూసి వాళ్ళ బాధని వినడానికి ప్రయత్నం చేస్తుంది. 


అప్పుడు వాళ్ళలో ఒక ఆవిడ అసలు ఆ గ్రామంలో ఎమ్ జరిగిందో వివరిస్తుంది. 


ఒక సంవత్సరం క్రితం 


గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ పెట్టారు అంట డానికి కూలీలు కావాలని మా వద్దకి వచ్చి అడిగారు ఎవరైనా పని చేస్తారా, జీతాలు బాగా ఇస్తాం అని... మా గ్రామం లో ఉన్న మొగవాళ్ళు ఆ ఫ్యాక్టరీ లో పని చేయడానికి వెళ్లి వస్తుండే వారు. 

కాని ఒక నాడు వాళ్ళకి ఒక గుడిసె కనిపించిందంట, ఆ గుడిసెలో అందాలని విరజిమే అందాల రాశి ఉందంట, ఆ గుడిసె లోకి పార్వతి మొగుడు వెళ్లి సుఖాలను అనుభవించి, మిగిలిన మొగ వాళ్ళకి నేర్పించాడు. వాళ్ళు కూడా ఆ వయ్యారి వేసిన వలలో పడ్డారు. 

ఒకరొకరిగా తన వద్దకు పనులు మానుకుని మారి తన వద్దకి వెళ్లి మరల ఇంటికి తిరిగి వెళ్లి వాళ్ళ పెళ్లాలని "నాకు వ్యామోని కావాలి, వ్యామోని కావాలి" అని మమల్ని హింసించేవారు, కాళ్ళతొ తొక్కేవారు. 


అసలు వీళ్ళకి ఎమ్ జరిగుతోంది, గవర్నమెంట్ వాళ్ళు కూడా నోటీసులు పంపారు, పనులకి రావట్లేదని, ఎమ్ జరిగింది వీళ్ళకి అని వాళ్ళని ఫాలో అవ్వడం మొదలు పెట్టాం అప్పుడు వాళ్ళందరూ ఒక గుడెస దగ్గర ఒక వరస క్రమం లో నుంచుని ఉన్నారు. అప్పుడే మొదటి సారిగా ఆ వ్యామోని ని చూసాము.అప్పుడు అర్ధమయింది ఎందుకు ఇంతలా ఎగపడుతున్నారో అని అప్పటినుంచే మేము కూడా నగ్నంగా ఉన్నాం, కనబడుతున్నాం. కాని వాళ్ళు ఎవరూ కూడా మమల్ని పట్టించుకోకుండా ఆ వ్యామోని వద్దకి వెళ్లి తిండి, తిప్పలు లేకుండా గడిపేవారు. 

కొన్ని రోజులు ఇంటికైనా వచ్చేవారు ఏదోక్క టైం లో కాని కొన్ని రోజులకి మా మొగవాళ్ళు ఒక్కరొక్కరిగా మాయమవుతున్నారు, ఏమవుతోoదో తెలిసేది కాదు. కాని గత ఆరు నెలలుగా ఒక మొగవాడు కూడా ఈ గ్రామం లో లేడు. అందరూ మాయమయిపోయారు అని వసుందరికి చెబుతున్నప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఒక దగ్గర నుంచుని టాయిలెట్ పోసుకుంటుంటే . 


వసుందర అతనిని చూసి అతను మొగ వాడేగా అని అడుగుతుంది. అప్పుడుఆవిడ "అవును "అంటాది. అప్పుడు వసుందరికి ఐడియా వచ్చి వాళ్ళందరిని దగ్గరకి రమ్మని, తన ఐడియా చెబుతుంది. అప్పుడు వాళ్ళందరూ వసుందర చెప్పిన ఐడియాని అంగీకరిస్తారు. 


తరువాత రోజు రాత్రి 


వసుందర, ఆ పిల్లవాడికి షర్ట్, ప్యాంటు వేసి ఆ గుడెస ఎదురుగా నుంచోపెడతాది. వసుందర రేగు పండు కెమెరాతో రికార్డు చేస్తుండంగా వ్యామోని డోర్ ఓపెన్ చేసి ఆ పిల్లవాడిని లోపలికి లాగి తలుపు వేస్తుంది. వెంటనే తెల్లవారు జాము అవుతుంది. ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, వసుందర అలా ఆశ్చర్యంగా నిలబడి ఉంటె, ఆ పిల్లవాడి తల్లి వసుందర వద్దకు వచ్చి "నా బాబు, ఎక్కడా ఎక్కడా "అని ఏడుస్తుంది. 

వసుందర ఆ తల్లి బాధ చూసి, వసుందర కూడా ఏడుస్తుంది. 

కొద్ది నిమిషాలు తరువాత వాళ్ళందరూ చేసేదేంలేక తిరిగి వసుందరతో సహా వెళిపోతారు. అప్పుడు వసుందర కెమెరాలో రికార్డు అయినది చూస్తుంటుంది. 

కెమెరాలో చాలా క్లియర్ గా వ్యామోని కనబడుతుంది. అలా వ్యామోనిని చూస్తున్న వసుందర కి మళ్ళీ ఇంకో ఐడియా వస్తుంది ఆ ఐడియా ని వాళ్ళతో షేర్ చేస్తె వాళ్ళందరూ" ఒద్దు "అంటారు. అయినా సరే వసుందర మొగవాడిగా తయారు అయ్యి గుడెస ముందు నుంచుంటాది. అప్పుడు వసుందర వ్యామోని కోసం ఎదురు చూస్తుంటుంది, రేగు పండు కెమెరాని షర్ట్ బటన్ లో పెట్టుకుంటుంది. 


కొద్ది నిమిషాలకి 


ఆ గ్రామం లో ఉన్న ఆడవాళ్లు శరీరంపై దుస్తులు ధరించుకుని, గుడెస వద్దకు వచ్చి అక్కడ ఏమి జరుగుతోందో గమనిస్తుండంగా, తలుపు తెరుచుకుంటుంది. 


వసుందర కళ్ళకి వ్యామోని కనిపిస్తుంది. వ్యామోనిని చూసిన వసుందర వ్యామోని మైకంలో పడి గుడెస లోపలికి అడుగు వేసిన వెంటనే, వ్యామోని తలుపు వేస్తుంది. 


అప్పుడు అక్కడున్న ఆడవాళ్ళందరూ ఆశ్చర్యంతో ఉండంగా; ఒకసారిగా ఆ గుడెస కూడా మాయమవుతుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అలా ఎదురుచూస్తుంటారు. రాత్రి, ఉదయం అవుతుంది.ఉదయం రాత్రి అవుతుంది. అలా నాలుగు రోజులు గడిచిపోతుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఇక చేసేదేమి లేదు అనుకుని మరలా నగ్నంగా ఉందామనుకుని బట్టలను విప్పుతుంటే. ఆకాశంలో ఒక మెరుపు వస్తుంది. అప్పుడు ఈ అడ వాళ్ళందరూ పైకి చూస్తారు, పైనుంచి వసుందర కింద పడుతుంది. అప్పుడు వాళ్ళందరూ వసుందర వద్దకి వెళితే. వసుందర "మీ కన్నీళ్ళు ఇంక కళ్ళలోంచి రావు "అని నవ్వుతూ అంటాది. అప్పుడు వాళ్ళందరూ ఇళ్లకి వెళ్లి చూస్తే వాళ్ళ భర్తలు ఉంటారు.... ఆ ఊరంతా సంబరంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. 


వసుందర తిరిగి ముంబాయి వెళుతుంది. 

వసుందర, కోదండాపురం లో జరిగిన సంఘటన అందరికి తెలియ జేయాలని ప్రతి మీడియా ఆఫీస్ కి తిరుగుతుంది 

కాని ఎవరూ పట్టించుకోరు. అప్పుడు తను సేకరించిన ఆదారాలకి వ్యామోని అని పేరు పెట్టగానే ఒకరు ఫోన్ చేస్తారు, ఆఫీసుకి రమ్మని. 

వసుందర ఆఫీసుకి వెళ్ళగానే అతను తనని కూర్చోమని "ఈ వ్యామోని అనే పేరు మీకు ఎలా తెలుసు, నేను కావ్యాలలో చదివాను ఆమె గురుంచి మీరు నిజంగా చూసారా అని అంటె. వసుందర తనకి కోదండాపురంలో జరిగిన సంఘటన గురుంచి చెప్పి దృశ్యాలు చూపిస్తుంది. అప్పుడు అతను "వీటిని మీరు ఎలా రికార్డు చేసారు అన్నగానే. వసుందర "నాకు బాగా గుర్తు నేను గుడిసెలోకి వెళ్ళగానే తను తన అందమైన సొగసుతో నను భ్రమింప చేసింది, నేను ఎప్పుడైతే ఆడదానిని అని తెలిసాక నను కిందకి తోసేముందు నా జోబులో ఉన్న రేగు పండు ని పైకి ఎగరేసి పెద్ద గా నవ్వి కృతజ్ఞతలు చెప్పింది, అలా ఎందుకు అన్నాదొ,నాకు ఇప్పటికి తెలియదు అని అనగానే అతను వసుందర న్యూస్ ని తీసుకుని అందరి చానెల్స్ కి ఇస్తాడు... 


ఆ ఒక న్యూస్ తో వసుందరికి ఎప్పటికి తిరిగి రాని విలేఖరీ జాబ్ వస్తుంది. 


వసుందర, ఇంటర్వ్యూ కోసం మీడియా వాళ్ళు ఎగపడతారు. 


వసుందరని ఒక టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి వసుందర ఈ విధంగా సమాధానం ఇస్తుంది. 


"నేను 2013లో అక్రమంగా మహిళలను బ్రోకల్ హౌసెస్ లో పాడేస్తున్న వాళ్ళ వీడియోలని తీసి నందుకు నా ఉద్యోగం పీకేశారు,నా పేరుని ఎవరికి వినబడనివ్వకుండా మాయం చేసారు. నేను వ్యామోని గురుంచి కథలు కథలుగా విన్నా, ఆమె కూడా మోస గింప పడ్డా అప్సరసలనుంచి కథలు సేకరించి ఇంద్రుడి వద్ద పెడితే, ఆ ఇంద్రుడు తెలివిగా ఆమె కు శాపం కలిగేలా చేసాడు అని. మే బి ఆవిడ కథ, నా కథ ఇంచు మించు ఒక కధలాంటిదే,నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నేను తనకి శాప విమోచనం చేస్తె ఆమె నాకు నా విలేకరి వృత్తి ని తిరిగి ఇచ్చింది, థాంక్స్ వ్యామోని, ఇప్పటినుంచి నా కలం పేరు వ్యామోని -విలేకరి "అని అతనికి సమాధానం చెప్పి అక్కడనుంచి లేచి తన పాప హాస్టల్ కి వెళ్లి తన పాప ని ఎత్తుకుని, ముద్దులు పెట్టి. హస్టల్ నుంచి తనని కొత్తగా తీసుకున్న ఒక కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు..... ఆ ఇంటిలో ప్రతి గోడకి వ్యామోని చిత్ర పటం ని తగిలిస్తుంది. 


అప్పుడు ఆ పాప ఆ చిత్రాలను చూసి " ఎవరూ అమ్మ తిను" అని అడుగుతుంది. అప్పుడు వసుందర "వ్యామోని -విలేకరి "అని చిన్న స్మైల్ ఇస్తుంది. 

*********సమాప్తం **********


Rate this content
Log in

Similar telugu story from Fantasy