kishore dasika

Children Stories

3  

kishore dasika

Children Stories

మూర్తి గారు

మూర్తి గారు

3 mins
367


ఈ కథ చిన్నదైనా ,దీని సారంశం మాత్రం బలంగా ఉంటుంది.


ఇక కథ లోకి వెళ్తే


మూర్తి గారు ,ఇతనొక్క రిటైర్డ్ లెక్చరర్.ఇతను రిటైర్డ్ అవ్వక ముందు ఇతని మంచితనం తో చాలా మంది మనసులను గెలిచి శిష్యులను సాదించుకున్నాడు.


ఒకనాడు మూర్తి గారు దీర్గ ఆలోచనల్లోకి వెళ్తాడు.ఆ ఆలోచనలోంచి ఒక ఐడియా తో బయటకి వస్తాడు.

వెంటనే తను దాచుకున్న డైరీ ఉన్న రూమ్ లోకి పరుగులు తీసి,అలమార్రెక్ ని ఓపెన్ చేసి అందులోంచి ఒక డైరీ ని బయటకి తీసి,ఆ డైరీ ని ఒక టేబుల్ మిద పెట్టి,కుర్చీని టేబుల్ వరకు తిసుకోచుకుని,కుర్చీలో కూర్చుని టేబుల్ మిద ఉన్న డైరీ లో ఉన్న పేజి లను తిప్పుతున్నప్పుడు,ఒక చిన్న పాప చేతిలో రెడ్ మార్కర్ పెన్ ని పట్టుకుని,మూర్తి గారి వద్దకి వెళ్లి మూర్తి గారిని తన కంటి సైగలతో పిలిచి టేబుల్ మిద పెట్టి తన రూమ్ కి పరుగులు తీస్తుంది.మూర్తి గారు ఆ పాప వైపు జాలిగా చూస్తూ రెడ్ మార్కర్ ని చేతిలోకి తీసుకుని,కనబడిన ప్రతి నెంబర్ కి రౌండ్స్ చుడుతుంటాడు.


కొద్ది సమయం గడిచాక


భయంకరంగా వర్షం కురుస్తుంటుంది...............


ఆ వర్షం లో గొడుగు పట్టుకుని ఒక కాల్ బూత్ లోకి మూర్తి గారు వెళ్లి డైరీ ఓపెన్ చేసి ఆ డైరీ లో ఉన్న నంబర్స్ కి కాల్స్ చేస్తుంటాడు.


వర్షం తగ్గుతుంది,మూర్తి గారు కాల్ బూత్ నుంచి ఒక ఆనందకరమైన అనుభవం ని తన మోఖములోకి తెచ్చుకుని ,ఇంటికి వెళ్ళే దారిలో అడుగులు వేస్తాడు.


మరుసటి రోజు


మూర్తి గారి ఇంటి ఎదుట తన శిష్యులు కార్లతో వచ్చి సందడి చేస్తారు.మూర్తి గారు వాళ్ళందరిని చూసి సంతోషంతో వాళ్ళ వద్దకి చేరగానే అందరు మూర్తి గారి ఆశిసులను తీసుకుంటారు.


కొద్ది సమయం గడిచాక


మూర్తి గారు వాళ్ళందరిని ఎందుకు రామ్మన్నాడో అనే విషయం గురుంచి తన శిష్యులకు కథల రూపంలో వివరించి ప్రతి రోజు ఇదే టైం కి రమ్మంటాడు.మూర్తి గారి మిద ఉన్న గౌరవంతో అందరూ అదే సమయానికి ,అదే చోటుకి వచ్చి ఉంటారు.మూర్తి గారు తనకొచ్చిన కష్టం గురుంచి కథల రూపం లో చెబుతుంటాడు,శిష్యులు వింటుంటారు.


అలా రోజులు నెలలు అవుతాయి,మూర్తి గారి మిద ఉన్న గౌరవం నెమ్మదిగా శిష్యులలో తగ్గుతూ వస్తుంది."మన పనులు మానుకుని మన సమయాని తనకి కేటాయిస్తుంటే కథలు చెప్పడం ఏమిటి అని శిష్యులందరు ఇకపై మూర్తి గారు కాల్ చేసినా వెళ్ళకుండా ఉండడానికి అందరు వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్చేసుకుని,ఒక ఏకాభిప్రాయానికి వస్తారు.


మూర్తి గారు శిష్యులు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు.రోజు గడుస్తూనే ఉంటాయి.మూర్తి గారి మనవరాలు ,మూర్తి గారి వద్దకి వెళ్లి,


తాత ,వాళ్లకి చెప్పే కధే నాకు చెప్పు ,వింటాను.అని అనగానే మూర్తి గారి కంటిలోంచి వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ ,తన మనవరాలని ఎత్తుకుని గిర గిర తిప్పి మంచం పై పడుకో పెట్టి,మనవరాలికి కథలు చెప్పడం మొదలు పెడతాడు.మూర్తి గారి మనవరాలు మూర్తి గారు చెప్పే కథలను చాలా శ్రద్ధతో వింటుంటుంది.


ఇలా మూర్తి గారు తన మనవరాలికి చెప్పే ప్రతి కథ మూర్తి గారి శిష్యులకి ఒక్కో సంఘటనతో వాళ్ళ కళ్ళ ఎదుటకి వచ్చి నిలబడతాయి.ప్రతి కథలో ఎదోక్క సమస్య ,ఆ సమస్య వివరణ మూర్తి గారు ముందే చెప్పడం తో ,ఆ సమస్యలనుంచి శిష్యులందరు త్వరగా బయట పడిన వెంటనే గుర్తు కొచ్చిన ఒకేఒక్క వ్యక్తి మూర్తి గారు.శిష్యులందరు,మూర్తి గారిని తప్పుగా అర్ధం చేసుకున్నామని అనుకుని అందరు ఒక దెగ్గరకి చేరి మూర్తి గారిని కలవాలనుకుంటారు.


మరుసటి రోజు


మూర్తి గారు తన మనవరాలని భుజాలపై ఎత్తుకుని కన్నీళ్లను కారుస్తూ డోర్ ఓపెన్ చేయగానే,మూర్తి గారి శిష్యులందరు పెద్ద పెద్ద సూట్కేసు ల నిండా డబ్బుతో వచ్చి మూర్తి గారి ఎదుట నిలబడగానే మూర్తి గారి తన మనవరాలని వాళ్లకి చూపించి ,అంతా అయిపొయింది అని ఏడుస్తూ కుప్ప కులిపోతాడు.శిష్యులు తన వద్దకి వస్తుంటే,మూర్తి గారు వద్దు అని అడ్డు పడతారు ,అప్పుడు శిష్యులు మమ్మల్ని క్షమించండి మీరు చెప్పే కథలు మాకు కష్టాలుగా మారే వరకు మీ కష్టం తెలియలేదు అని అంటారు.అప్పుడు మూర్తి గారు తన మనవరాలి వైపు చూస్తూ,నా మనవరాలికి కాన్సర్ ,లాస్ట్ స్టేజి ,ఆపరేషన్ చేసిన లాభం లేదు అన్నారు .కాని నా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని పిలిపించుకుని,నా సమస్యని కథల రూపం గా చెప్పాను.అంతా నా తప్పే ఇప్పుడు మీకు చెప్పిన విధంగా అప్పుడు కథల రూపంగా కాకుండా చెప్పి ఉంటె ఒక చిన్న ప్రయత్నం జరిగేది , సారీ చిట్టితల్లి అని ఏడుస్తుంటే,శిష్యులు కూడా మూర్తి గారి బాధని చూసి బాధపడుతుంటారు.


కొద్ది సమయం గడిచాక


మూర్తి గారు ఎవరితోనూ మాట్లాడకుండా తన మనవరాల ను భుజ్జం పై ఎత్తుకుని,శ్మశానం లోకి తీసుకుని వెళ్తాడు.


నీతి : సమస్యని సరైన విధంగా చెప్పలేక పొతే,ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలనే ప్రయత్నం విఫలంగా మారుతుంది.


Rate this content
Log in