kishore dasika

Drama

3  

kishore dasika

Drama

హలో సర్ గోవిందం గారు

హలో సర్ గోవిందం గారు

3 mins
412


ఒక వ్యక్తి కథ, ఇందులో మీరు మెస్సేజ్ ని తీసుకుంటారో లేదా ఇంకేదైనా తీసుకుంటారో లేదా ఈ కథ లో ఉండే పాత్ర మీ జీవితానికి ఉదాహరణగా చేసుకుంటారో మీ ఆలోచనల ఇష్టం. ఇక కథలోకి వెళ్దాం. 


ఒక అతను, 55 ఏళ్ళు ఉంటాయి. ఒంటరిగా రోడ్ మీద ఆనందబాష్పాలతో నడుచుకుని వెళ్తుంటే, వెనుక బండి మీద ఒకతను "హలో సర్, గోవిందం గారు".అంటూ అతని వద్దకి వెళ్లి 

"అయ్యో ఏమిటండి గోవిందం గారు, మీ బండి ని, మా ఇంటి దగ్గర వదిలేసి ఇలా కాళ్ళి నడకన

 

గోవిందం : నా వలన మీకు విజయం అన్న దగ్గర నుంచి ఆనందబాష్పాలతో ఇలా బండి మరిచి" అని అంటుంటే. గోవిందం మాటకి అడ్డుపడి


"అర్థమైంది అండి, మీకు తోడు మేము ఎప్పుడూ ఉంటాం. "అని గోవిందంకి బండి ఇచ్చి వెళ్తుంటాడు. 


గోవిందం అతని వైపు చూస్తు పెదాలపై చిరునవ్వు తెచ్చుకుంటాడు. ఈ చిరునవ్వు కి కారణమైన వాటిని తలచుకుంటూ బండెక్కి శుభవార్తని ఇంట్లో వాళ్ళతో పంచుకోవడానికి వెళ్తుంటాడు. 


ఇంతకీ గోవిందం ఆనందబాష్పాలతో,భావోద్వేగంతో, చిరునవ్వుతో తనకి జరిగినది ఎందుకు చెప్పుకోవడానికి వేగంగా వెళ్తున్నాడో తెలుసుకోవాలంటే కట్టె, కొట్టే, తెచ్చే టైపు లో గోవిందం గురుంచి వివరిస్తా వినుకోవండి, సారి చదువుకోవండి. 


కొన్ని సంవత్సరాల క్రితం 


గోవిందం చాలా సుకుమారుడు, మనసులో ఎన్నో భావోద్వేగాలను మోస్తూ అందరికి మంచి చేయాలనే కోరిక చిన్నప్పటినుంచి బాగా అలవాటు గా మార్చుకున్న వ్యక్తి. అందుకే బాగా చదువుకుని ఉద్యోగం సందిస్తాడు. కాని గోవిందం అమ్మ బెంగళూర్ లో ఉద్యోగం అనగానే భయంతో బిక్క మొహం వేసేసరికి బెంగళూర్ బయలుదేరడం ఆగిపోయి. భయాలు వద్దు అని నెలలు తరపడి తన అమ్మని బుజ్జగిస్తుంటాడు. 


అలా కొన్ని నెలలు గడిచేసరికి మళ్ళీ గోవిందంకి హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది. నెలకి 45,000 అని గోవిందం తన అమ్మతో చెప్పగానే. గోవిందం అమ్మ "సరే "అంటుంది. 


అమ్మ అంగీకారంతో బస్సు ఎక్కిన గోవిందం, ప్రయాణం మధ్యలో కొంతమంది నిరుద్యోగులు ధర్నాలు చేయడం చూసిన గోవిందం ఒక కీలక నిర్ణయానికి వస్తాడు. బస్సు దిగి, ఉద్యోగం లో చేరతాడు. 


అలా కొన్ని నెలలు పని చేసాక అతను అతను చేసే ఉద్యోగం ఆఫీసులోనే కాకుండా చుట్టు పక్కల ఉన్న ఆఫీస్ లో వాళ్ళని కూడా మంచిగా కలుపుకుని ఉద్యోగం ఖాళీలు ఉన్న చోట గోవిందం వద్దకి దారి చూపించు, ఉద్యోగం ఇప్పించు అని వచ్చే వాళ్ళకి రికమండేసన్ తో ఉద్యోగాలు ఇప్పిస్తుంటాడు. అలా వాళ్ళందరూ ఉద్యోగం సంతోషంగా చేసుకోవడం చూసి గోవిందం చాలా ఆనంద పడతాడు. 


కొన్ని నెలలు తరువాత గోవిందంకి, గోవిందం అమ్మ పెళ్లి చేస్తుంది. 


గోవిందం భార్య ముక్కు సూటి.పేరు స్రవంతి. 


స్రవంతి గోవిందంకి ప్రెషర్ పెట్టి, ఇంకా మంచి ఉద్యోగం చేయండి అని అంటుంటుంది. భార్య మాట కాదనలేక, ఉద్యోగాలు మారుస్తుంటాడు. చాలా మందికి ఉద్యోగం విపిస్తుంటాడు. 


ఒకనాడు స్రవంతి, గోవిందంతో ఇలా అంటుంది. "మీరు బాగానే ఉద్యోగం విపిస్తున్నారు, కాని వాళ్ళు సరిగా చేస్తున్నారో లేదో గమనించారా అని అడుగుతుంది. 


అప్పుడు గోవిందం, తను జాయిన్ చేసిన ఆఫీస్లలో ఉన్న వాళ్ళని కనుక్కుందామని వెళ్లి అడిగితే చాలా మంది రెండు నెలలకే ఉద్యోగం మానేసి వెళిపోయారు, ఇంకొంతమంది రేపో, మాపో మానేస్తారు అని తెలుసుకుని, భావోద్వేగానికి లోనై అలిగి కూర్చుంటాడు. 


గోవిందం అలకని గమనించిన స్రవంతి ఈ విధముగా అంటుంది. 


"మీరు ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు. వాళ్ళకి నచ్చక మానేశారు అనుకుంట "

గోవిందం : ఉద్యోగం నచ్చకొ, నేను నచ్చక మానేశారో ఎవరికి తెలుసు. నేను వాళ్ళకి సరైన దారి చూపించలేదు" అని సమాధానం ఇస్తే. 


అప్పుడు స్రవంతి "అయితే ఒక పని చేయండి, మీరే వెళ్లి అడగండి. మి వలన వాళ్ళు ఉద్యోగం మానేసాం అని అంటె అప్పుడు బాధపడండి" అని అంటుంది. 


అప్పుడు గోవిందం, స్రవంతి చెప్పిన ఐడియా నచ్చి తన వద్ద ఉన్న మోటార్ సైకిల్ తో తను ఉద్యోగం విపించిన ప్రతి ఇంటికి వెళ్లి "అసలేం జరిగింది, ఉద్యోగం మానేయడానికి కారణం ఏమిటి "అని అడుగుతుంటారు. 


వాళ్ళందరూ గోవిందం ని మెచ్చుకుంటూ,మి వలన మేము మానేలేదు, మాకు నచ్చక మానేసాం అని అంటుంటారు. 


గోవిందం కి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మనస్తృప్తి కలిగించక, తలనొప్పి బాగా వచ్చి, టి కొట్టు వద్ద ఆగి టి తాగుతుంటాడు. 


ఒక అతను గోవిందం వద్దకి వెళ్లి "గోవిందం గారు గుర్తు పట్టారా, మీరు నాకు గనక ఉద్యోగం విపించక పొతే ఈ రోజు ఇల్లు కట్టి దానికి గృహప్రవేశం చేయిన్చేవాడినే కాదు, బలే కనబడ్డారు రండి మా ఇల్లు చూద్దురు గాని " అంటూ గోవిందం ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. 


అలా తన ఇంటికి వెళ్లిన గోవిందం, ఆ కుటుంబ సాభ్యుల సంతోషాని చూసి ఆనందబాష్పాలు తెచ్చుకుని బండిని అక్కడే వదిలి వెళ్తుండగా అతను బండిని తీసుకుని గోవిందంకి ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తాడు. 


ప్రస్తుతం 


గోవిందం దర్జాగా ఈ విషయం తన భార్య స్రవంతితో చెప్పుకోవడానికి వేగంగా ఇంటికి వెళ్లి స్రవంతిని ఎత్తుకుని ఈ విధముగా అంటాడు. 


"నువ్వు అనట్లే అందరి ఇంటికి వెళ్లి అడిగాను కాని వాళ్ళ సమాధానం నాకు మనస్తృప్తిని కలిగించలేదు కాని ఒక అతను నా ద్వారా సాయం పొందిన వ్యక్తి నా వద్దకి వచ్చి, నేను తన జీవితంలో నింపిన సంబరాన్ని చూపించే సరికి నాకు కళ్ళలో ఆనందబాష్పాలు అని చాలా ఆనందంగా స్రవంతితో చెప్పుకుంటాడు. 

అప్పుడు స్రవంతి "మా ఆయన బంగారం "అని ముద్దు పెడుతుంది. 


ఇలా గోవిందం తను అనుకున్నట్లుగా కొంతమంది కైనా దారి చూపించాను అని మనుసులో ఉన్న కలతలని తొలిగించుకుని జీవినం కొనసాగిస్తాడు. 


మోరల్ :మనం ఎవరి నుంచెనా కొద్దిగా సాయం పొందిన, మనకి సాయం చేసిన వాళ్ళకి చూపించాలి, చెప్పాలి. అప్పుడు ఆ మనిషి ఆనందానికి ఈ గోవిందం లా అడ్డాలుండవు,ఆనందబాష్పాలు వస్తూనె ఉంటాయి. 



Rate this content
Log in

Similar telugu story from Drama