kishore dasika

Drama

2  

kishore dasika

Drama

కలంతోనే నా ప్రయాణం

కలంతోనే నా ప్రయాణం

6 mins
247



ఈ కథ ఎక్కడో జరిగే ఉంటుందని ఊహించి రాసినది మాత్రమే కాదు ఈ కథ లో పాత్రలు మాట్లాడే మాటలు పచ్చి నిజం.... 


ఈ కథ పూర్తిగా నాకు నచ్చిన కథ, రాస్తున్నప్పుడు బాగా బావోద్వేగానికి గురి చేసిన కథ........... .


*************************************


ఇక కథలోకి వెళితే............ 


వార్తా పత్రిక కార్యాలయం 


సమయం :10:30 ని"లకు. 


ఎడిటర్ రూమ్ లో 


ఆ ఎడిటర్ చేతిలో, ఒక రచయిత రాసిన కథ యొక్క ఫైల్ ఉంటుంది. ఆయన ఎదురుగా విశాలాచార్య అనే రచయిత, ఆ ప్రముఖ వ్యక్తి వైపు చాలా ఆతృతగా చూస్తు నిలబడి ఉంటాడు. 


అప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి, విశాలాచార్య వైపు విసుగుగా చూసి "ఎమిటయ్యా, ఈ కథని రాసినది. నువ్వేనా !"అని అడుగగా విశాలాచార్య చాలా ఉత్సాహంతో "అవునండి, నేనే"అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ప్రముఖ వ్యక్తి ఎటకారంగా నవ్వుతూ "నేను నమ్మనయ్యా, నేను నమ్మాలంటే. నేను ఒక వాఖ్యం చెబుతా, దానిని నువ్వు 'చక, చకా' రాయాలి అప్పుడే నమ్ముత"అని అంటాడు. అప్పుడు విశాలాచార్య, దానికి అంగీకరించి తన దగ్గర ఉన్న కలం మరియు కాగితంని తీసుకుని అక్కడే ఉన్న బల్ల పై కూర్చుంటాడు. అప్పుడు ప్రముఖ వ్యక్తి బుర్ర గోక్కుంటూ ఇలా వాఖ్యానిస్తాడు" నా పేరు విశాలాచార్య, నేను గత కొన్నేళ్లుగా రచయితగా పని చేస్తున్న. నా కంటే గొప్ప రచయిత ఎవరు లేరు"అని విశాలాచార్య వైపు చూసి.!"నా వాఖ్యం పూర్తి అయ్యింది.మరి,మీ రాత అని అనగానే. విశాలాచార్య రాయడం పూర్తి చేసి, ఆ కాగితం ని ప్రముఖ వ్యక్తి కి ఇస్తాడు.


అప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి, విశాలాచార్య కాగితం లో ఉన్న అక్షరాలను చూసి నవ్వుతుంటాడు,విశాలాచార్య కి ఎమ్ అర్ధం కాక "గురువుగారు, ఎందుకు నవ్వుతున్నారు" అని అడుగుతాడు. ప్రముఖ వ్యక్తి నవ్వుతూ; ఒక అతనిని పిలిపించి, చదువు అంటాడు. అప్పుడు అతను ఆ అక్షరాలను చూసి బిత్తర పోతాడు. ఇంతకీ ఆ కాగితంలో విశాలాచార్యకి ప్రముఖ వ్యక్తి వాఖ్యానిస్తుంటే విశాలాచార్య కాగితం పై ఈ విధంగా రాస్తాడు (నా పెఱ్ఱు వికారనాధం, నెన్ను గత కొనేళ్లు గా రచయితగా పంరి చేస్తున్న. నా కొంటిరి గోస రచయిత ఎవరు లేరు. )ఆ అక్షరాలను చూసే ప్రముఖ వ్యక్తి, విశాలాచార్య రాసిన కథ యొక్క ఫైల్ ని తిరిగి విశాలాచార్య చేతికి ఇచ్చి "కథ బాగుంది కాని మేము మా వార్తా పత్రికలలో ప్రచురించలేము, ఎందుకు ప్రచురించాలేమో.. !కారణం కూడా చెప్పలేము, ఇక మీరు దయజేయండి"అని అనగానే విశాలాచార్య కి ఆయన మాటల్లో అంతరార్థం అర్థమై,ఆ కార్యాలయం నుంచి బయటకి వచ్చి తన మామగారు ఇచ్చిన సైకిల్ వైపు చూసినప్పుడు విశాలాచార్య కి కొన్ని వాయిస్ లు వినబడుతుంటాయి.విశాలాచార్య మావయ్య వాయిస్ అందరూ అడిగే ప్రశ్న అని తేలికగా తీసుకోకు.... నువ్వా ని కలం తో కళ్ళు నేల మీద నిలబడనివ్వవు, ఊహలలోనే ఉంటావ్. అలాంటి వాడికి నా కూతురిని నమ్మకంగా ఎలా పంపిస్తాను. 

విశాలాచార్య వాయిస్ ఈ కాలంలో నా ఈ కలం తొనే నా ప్రయాణం. ఈ కలమే మీ కూతురిని నాకు దగ్గర చేసిందండి. మీకు నేను ఇప్పుడు నమ్మకం కలిగించలేకపోవచ్చు.కాని ఈ కలమే నన్ను నలుగురు గుర్తించే కాలం ని తెస్తుంది. విశాలాచార్య మావయ్య వాయిస్ నువ్వేమంటావ్, పార్వతి అణాపైసా సంపాదించని వాడితో వెళ్లి కాలంనడిపించగలవా పార్వతి వాయిస్ కాలం ని మనం నడిపించలేము నాన్న, కాలమే మనల్ని నడిపిస్తుంది. నాకు నీతో ఉంటే కష్టం అనిపించదు. 


విశాలాచార్య మావయ్య వాయిస్ కష్టం అనిపించదు, కష్టాలైతే వస్తాయి. వీడితో వెళితే చిరిగిన చీర తొ ఉండాలి. 


పార్వతి వాయిస్ఉంటాను. 


విశాలాచార్య మావయ్య వాయిస్ 

నీ పిల్లలకి చదువు కూడా చెప్పించలేడు. 


పార్వతి వాయిస్నేను చదువుకున్నాను కదా. ఆయన వృదిలోకి వచ్చే వరకు 

నేనే వాళ్ళకి చదువు చెబుతా. 


విశాలాచార్య మావయ్య వాయిస్ 

నీ కర్మ అనుభవించు. నువ్వు ఒకసారి ఈ గడప దాటితే నా కంఠం లో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఎలా ఉన్నావ్ అని కూడా చూడను... బాగా చిచ్చు పెట్టావ్ పెద్ద మనిషి నాకు నా కూతురికి, ఆ మూలాన పడేసి ఉన్న సైకిల్ ని అయినా 

తీసుకుని వెళ్లు. 


అనే మాటలు విశాలాచార్య ఆ సైకిల్ వైపు చూస్తూ, ఆ సైకిల్ వద్దకి వెళ్తున్నపుడు తన అంతరంగం లో వినబడుతుంటాయి. టక్కుమని విశాలాచార్య ఆ అంతరంగ వాయిస్ ల నుంచి బయటకి వచ్చి సైకిల్ స్టాండ్ తీసుకోని, సైకిల్ ఎక్కి ముందుకు పోనిస్తుండగా ఎన్నో నవ్వులు, సలహాలు అంతరంగంలో వినబడి కళ్లలొంచి కన్నీళ్ళు ధారలా వస్తున్నప్పుడు విశాలాచార్య సైకిల్ వేగం పుంజుకుని తన ఇంటి వద్ద ఆగుతుంది.(ఈ దేశంలో ఎంతో మంది రచయితలు, వాళ్ళ లో ఈ విశాలాచార్య కూడా ఒక రచయితే. కాని విశాలాచార్య,అక్షరదోషం తో బాధ పడుతుంటాడు(కాని ఈ విషయం విశాలాచార్య దృష్టికి తీసుకురాకుండా కప్పిపుస్తు సానుభూతి తెల్పుతుంటారు).ఒక పక్క విశాలాచార్య భార్య కి కొత్త చీర కూడా కొనలేక పోయాను అనే దిగులు తో పాటు, తన కొడుకుని మంచి స్కూల్ లో చదివించలేకపోతున్నాను అనే బెంగ తో సైకిల్ స్టాండ్ వేసి తన భార్య అయిన పార్వతి పిలుస్తున్నా పలకకుండా అలా పట్టు మంచంపై నిదురపోతాడు. అలసిపోయారు అనుకున్న పార్వతి విశాలాచార్య నిద్రని బంగపరచదు..... 


మరుసటి రోజు ఉదయం :


విశాలాచార్య భార్య పార్వతి, విశాలాచార్య దగ్గరికి పరిగెత్తుకుంటు వెళ్లి, విశాలాచార్యని లేపుతూ "అయ్యా, లే అయ్యా,ఒక శుభవార్త, 25 వేలు బహుమతి".అని అనగానే, విశాలాచార్య టక్కుమని లేచి "25వేలు బహుమతా !ఎవరిస్తున్నారే? "అని చాలా ఆతృతగా అంటాడు. 

పార్వతి 


ఒక కంపెనీ వాళ్లు, రచయితల పొట్టిని

నిర్వహిస్తున్నారు. 

రచయితల గురుంచి గాలింపులు చేస్తున్నారు 

అంటండి. అందులో గెలిచిన రచయితకి 

ప్రైస్ మనీ 25 వేలు. 

లేవండి, గెలవండి మన కష్టాలు తిరుపోతాయి 

కదండి.మా నాన్న కి బుద్ది చెప్పాలి. 

అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటాది. విశాలాచార్య కళ్ళ లోంచి కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు పార్వతి, ఆ కన్నీళ్ళను తుడుస్తూ. 

పార్వతి 


ఎమైందండి, మనం గెలుస్తాము కదా. 

అని అంటే. విశాలాచార్య, పార్వతి కళ్ళ వైపు చూసి, ఒక చిన్న చిరునవ్వు తో. 

విశాలాచార్య 


తప్పకుండా గెలుస్తాం. 

అని బట్టలు సద్దుకుని, ఆ కాంపిటీషన్ కి వెళ్లి పేరు ఇస్తుంటే. కొంత మంది విశాలాచార్య ని చూసి నవ్వుతుంటారు. అయినా విశాలాచార్య ఆ నవ్వులను లెక్క చేయకుండా,పేరు ఇస్తాడు. 


కొన్ని రోజుల తరువాత :


విశాలాచార్య, రాసి పంపుతున్న కథలు తిరిగి వచ్చేస్తుంటాయి. ఆ పోటీని నిర్వహించే వాళ్లు విశాలాచార్య కథలను పూర్తిగా చదవకుండా, అక్షరదోషం వలన మీ కథ ఎంపిక అవ్వలేదని,ఒక ఫైల్ వెనుక రాసి పంపుతారు. అది చదివిన విశాలాచార్యకి అర్ధమవుతుంది, ఇంతవరకు తనకున్న లోపం ఎవరూ చెప్పలేదు, నేను కూడా గుర్తించలేకపోయాను అని పట్టరాని దుఃఖం వస్తుంటుంది. పార్వతి, విశాలాచార్యకి ధైర్యం చెబుతూ ఉంటుంది. 25,000 ప్రైస్ మని ఇంకొక్కరికి వెళిపోయిన తరువాత . విశాలాచార్య దుఃఖం తో చాలా అప్పులు చేస్తాడు,తన కొడుకు చదువు కోసం. 


కొన్ని రోజులకి మళ్ళీ ఆ కంపెనీ వాళ్లు 50,000 కాంపిటీషన్ ని మొదలు పెడతారు. 


విశాలాచార్య మళ్ళీ ఆ పోటీలలో తన పేరుని ఇచ్చి, కథ రాయటం మొదలు పెడతాడు. 


మళ్ళీ వాళ్లు ఒకే ఒక కారణంతో రిజెక్ట్ చేస్తారు.. విశాలాచార్య ఓడిపోతాడు. లోపం సరిదిద్దు కున్నా మరలా ఇలా జరిగిందేమిటి అని ఆలోచిస్తుండగా పోటీలలో రాజకీయం జరిగి పోటీ నిర్వాహకులు పోటీని పక్క దారి పట్టించారని తెలుసుకుని వాళ్ళ తప్పు వల్ల నాకు అన్యాయం జరిగింది. దేవుడు ఇచ్చిన అవకాశం వాళ్ళు నాకు లోపం ఉందనే వంకతో రాజకీయాలు చేసి పక్క వాళ్ళకి ఇచ్చారనే దుఃఖం తొ ఉంటాడు. 


అప్పు వాళ్ళు, విశాలాచార్య ఇంటికి వెళ్లి బెదిరిస్తారు. విశాలాచార్య కొడుకుని స్కూల్ నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టలేదని పంపించేస్తారు. 


ఇక విశాలాచార్య, ఆ పరిస్థితులను చూసి చాలా దుఃఖం లో మునిగిపోతాడు. ఇంటి లోపలకి కోపంగా వెళ్లి ;తను రాసిన కథలు రోడ్డు పై పడేసి. నిప్పు అంటిదాం అనుకునే సమయానికి ఒక వార్త వస్తుంది. 



ఈ సారి మళ్ళీ, ఆ కంపెనీ వాళ్లు కొత్త వాళ్ళను నియమించి. ప్రతి రచయితకి ఇంటికి వెళ్లి పశ్చాతాపం తెలిపి, ఈ సారి ఆ ప్రైస్ మనీ డబల్ చేశామని అంటే పోటీలో గెలుపొందిన వాళ్ళకు లక్ష రూపాయిల ప్రైస్ మనీని అనౌన్స్ చేస్తారు. అప్పుడు విశాలాచార్య పార్వతి వైపు చూసి "ఇంకా కలం మీద నమ్మకం ఉంది పారు. కాని ఈ రాజకీయాలు మళ్ళీ వస్తే తట్టుకోవడం నా వల్ల కాదు " అని అన్నప్పుడు పార్వతి "మీ లోపం ఏమిటో తెలియనప్పుడు ఒడ్డారు, మీ లోపం తెలిసాక, మీరు ఆ లోపం సరి చేసుకున్నాక కావాలనే అబద్దపు మాటలతో మిమ్మల్ని ఓడించారు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తొవ్వుకున్నారు. పోటీకి పేరు ఇచ్చి రండి తప్పకుండా ఈ సారి మీ గెలుపుకి మా నాన్న రాకపోతే అడగండి "అని చిన్న గా నవ్వడంతో ఆ నవ్వు ని చూసిన విశాలాచార్య తనుకున్న బెంగని,భయాలను మొత్తం పక్కన పెట్టి,పోటీకి కథలు రాయడం మొదలు పెడతాడు.   


మరుసటి రోజు 


ఉదయం 


విశాలాచార్య తన మావయ్య ఇచ్చిన సైకిల్ మీద పోటీ జరిగే స్థలంకి వెళ్లి సబ్మిట్ చేసి వెళ్తుండగా. ఒక అతను విశాలాచార్య ని పిలిచి "ఎక్కడికి వెళ్తున్నారు అండి, పోటీ ఈ రోజే ముగింపు...మీరే స్వయంగా వివరించాలి, ఆ రూమ్ లో కూర్చోండి "అని అనగా విశాలాచార్య కి ఎమ్ అర్థంకాక ఆ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు.ఆ రూమ్ లో వందల మంది ఉంటారు. ఇలాంటి రూమ్ లు మొత్తమ్ పది ఉంటాయి. ఈ పోటీని చాలా కట్టు దిద్ధంగా నిర్వహిస్తుంటారు. జడ్జెస్ 50 మంది ఉంటారు. మొత్తం 5 రౌండ్లు టేబుల్స్ ఏర్పాటు చేసుకుని రచయితలను పిలిపించుకుని కథలు చెప్పించుకుంటూ ఆ కథ చెప్పే విధానంకి మార్కులు వేస్తుంటారు. 

అలా ఉదయం 9:00 నుంచి సాయంకాలం 5:30 వరకు టైం టేబుల్ ని మూడు రోజులు వరకు పెట్టుకుంటారు. 


రూమ్ లో విశాలాచార్య తనని ఎప్పుడు పిలుస్తారో అని ఎదురుచూస్తుండగా. 


కొద్ది నిమిషాలకి 


విశాలాచార్యని లోపలికి పిలిపిస్తారు. విశాలాచార్య, లోపలికి చాలా భయంగా వెళ్తాడు. విశాలాచార్య జడ్జెస్ ముందు కుర్చుంటాడు. 


జెడ్జి లు విశాలాచార్య ని చూసి 'మీరేన విశాలాచార్య'ఈ కథని రాసినది మీరేగా. ఒక సారి వివరిస్తారా


అని అడగగానే, విశాలాచార్య కళ్లలోంచి వస్తున్న కన్నీళ్ళను,తన చేతులతో తుడుచుకుంటూ.మొదట విశాలాచార్య మాట పలకడం తడబడ్డా వాళ్ళందరికీ తాను రాసిన కథని చక్కగా వివరిసస్తూ చివరిలో "ఇంతకు మించి ఏముంది లోకంలో. ఆశయంతో ఉన్నవాడికి ఆశే గా ఆకలి. ఒకవేళ ఆ ఆశ లేనిచో వచ్చే ఆకలి...తిన్నా, ఆ అన్నం అరగదుగా. "అని వాఖ్యానివ్వగానే విశాలాచార్య ముందు కూర్చున్న జడ్జెస్ పైకి లేచి హర్షంవ్యక్త పరుచి. ఆ కథని వివరించే విధానానికి అక్కడ ఉన్న జెడ్జిలు ఆశ్చర్య పడి, విశాలాచార్యని ఫలితాలు విడుదల చేసే వరకు వెయిట్ చేయమంటారు. 

విశాలాచార్యకి తనే గెలుస్తాను అనే నమ్మకం వస్తుంది. 

విశాలాచార్య, కథని చెప్పిన విధానం, కథ, ఆ జెడ్జిలకి బాగా నచ్చుతుంది. 


కొన్ని రోజుల తరువాత 


ఆశగా ఎదురు చూస్తున్న విశాలాచార్య కి ఒక శుభవార్త వస్తుంది. 


విశాలాచార్యని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. ఇంటికి స్వయంగా వచ్చి విశాలాచార్యని సభకు తీసుకుని వెళ్లి సన్మానం చేసి ఆ ప్రైస్ మనీ ని విశాలాచార్య చేతులకి ఇస్తారు.పార్వతి, విశాలాచార్య ని చూసి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటుంది. 


ఎవరైతే మొదట్లో విశాలాచార్య వార్తా పత్రిక వద్దకి వెళ్లి కథని ప్రచురించమంటే సరైన వివరణ లేకుండా తిరష్కరించారో. అతనే తన వార్తాపత్రికలో విశాలాచార్య గురుంచి గొప్పగా రాస్తాడు. 



విశాలాచార్య చేసిన అప్పులను తిర్చేస్తాడు, తన కొడుకును స్కూల్ కి పంపిస్తాడు.విశాలాచార్య మావయ్య తన వద్దకి వచ్చి తనని తన కూతురి ని ఆశీర్వదించి వెళిపోతాడు.  


విశాలాచార్య తన భార్యతో కలిసి కొత్త కథలను రాయడం మొదలు పెడతాడు..... నలుగురికి ఆశ్రయం ఇస్తాడు. 


***********--------------********************-

రచయిత వాఖ్యాలు 


"ఇంతకు మించి ఏముంది లోకంలో. ఆశయంతో ఉన్నవాడికి ఆశే గా ఆకలి. ఒకవేళ ఆ ఆశ లేనిచో వచ్చే ఆకలి...తిన్నా, ఆ అన్నం అరగదుగా".



ఈ కలం తొనే నా ప్రయాణం ✊️✊️✊️✊️✊️✊️.


*************--------------********------------






Rate this content
Log in

Similar telugu story from Drama