పట్నం పులి
పట్నం పులి


అది ఒక అమావాస్య రాత్రి
గిరిజన ప్రాంతం
సమయం : 10:10 p. m
చాలా మంది జనం ఖాగడాలు పట్టుకుని నిలబడతారు,ఆ ఖాగాడాల చివర వెలిగే నిప్పు వెలుతురులో కొంతమంది విదేశీయులు ఒంటి నిండా దెబ్బలతో నిలబడి ఉంటారు.
అడవిలో ఐదు పులులు తిరుగుతున్నాయి ,ఆ ఐదు పులులు మేము మా స్నేహితులతో అడవిలోకి వెళ్ళిన మొదటి బాగంలోనే మాకు ఎదురయ్యి మా మీద దాడి చేసాయి ,అవి మా నలుగురి మిద దాడి చేసేసరికి మా స్నేహితులలో మిగిలిన ఆరుగురు ఆ అడవిలోకి పారిపోయారు .మేము నలుగురం ఎలాగో ఈ దెబ్బలతో బయటపడాము ,దయచేసి వాళ్ళని మా వద్దకి సురక్షితంగా తీసుకువస్తారేమో అని ఆశతో మీ వద్దకు వచ్చాము అని అక్కడున్న పెద్దమనిషిని ఆ విదేశీయులు కోరతారు .
అప్పుడు ఆ పెద్దమనిషి "మీకు ముందే చెప్పాను కదా . అది ఒక మహమ్మారైన అడవి ,ఆ అడవిలో దారులన్నీ చిక్కు ముడిలతో ఉంటాయి ఒక సారి ఎట్టువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి రావడం కష్టం అని ,అయినా మాట విన్నలేదు .ఇక మీ స్నేహితుల గురుంచి మరచి తిరిగి మీ దేశాలకి
వెళ్ళిపోవండి,ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా ఆ అడవిలోకి వెళ్లి తిరిగి రావడం తెలియదు "అని అనగానే.
అక్కడున్న చిన్నపిల్లవాడు "మా నాన్న ఎప్పుడూ ఆ అడవిలోకి వెళ్లి వస్తుంటాడు సురక్షితంగా, మాకు తిండి కూడా తెస్తాడు "అని గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు ఆ పిల్లవాడి అమ్మ, ఆ పిల్లవాడి నోరుని తన చేతులతో మూస్తుంది. ఆ పిల్లవాడి తండ్రి "ఎదో చిన్నపిల్లవాడు, తెలియక అలా అన్నాడు, క్షమించండి"అని అంటె.
అప్పుడు ఆ పిల్లవాడు, తన నోటినుంచి తన తల్లి చెయ్యిని తప్పించుకుని "ఎందుకు నాన్న అబద్దం చెబుతావ్, వెళ్ళు నాన్న, వెళ్లి వాళ్ళని కాపాడచ్చుగా.
అన్నప్పుడు ఆ పిల్లవాడు తండ్రి "విష్ణు, నోరు మూసుకో "అని గట్టిగా అరిస్తే. ఆ అడవి పెద్ద మనిషి "శేఖర్ "అని గట్టిగా పిలిచి ఒకో మెట్టు కిందకి దిగుతూ "ఈ అడవిలో మాకు తెలియకుండా చాలా చేస్తున్నావ్ అన్న మాట, అయితే వెళ్ళు కాపాడు, నీకు నెల రోజుల గడువు ఈ లోపు వాళ్ళని తిరిగి ప్రాణాలతో తీసుకుని రావాలి లేదా ఈ గ్రామం వదిలి వెళ్ళాలి అని హెచ్చరిక చేసి వెళిపోతాడు. అక్కడున్న జనం శేఖర్, శేఖర్ కుటుంబంని చూసి నవ్వుతూ, వెక్కిరిస్తూ వెళుతుంటారు.
వర్షం పడుతుంటుంది
శేఖర్, శేఖర్ భార్య లక్ష్మి, తన కొడుకు విష్ణు అలా వర్షంలో తడుస్తుంటే విదేశీయులు వాళ్ళ వద్దకి వెళ్లి వాళ్ళ ముగ్గురికి మూడు గొడుగులు ఇచ్చి శేఖర్ కి నమస్కారం చేసి "మా స్నేహితులని క్షేమంగా తీసుకుని వస్తే మీ గ్రామానికి ఊహించని బహుమతి ఇస్తాం "అని వాళ్ళు జిప్ ఎక్కి వెళిపోతారు.
అదే రోజు
సమయం :11.30 P.M
విష్ణు ని, లక్ష్మి చీపురుతో కొడుతుంటే, విష్ణు "అమ్మ నేను ఎమ్ చేసాను అమ్మ, నాన్న ని అందరి ముందు హీరో చేద్దామనుకున్నా. అయినా వాళ్ళని కాపాడడంలో తప్పు ఏముంది? "
అప్పుడు లక్ష్మి "తప్పు చేసి, ఏముంది అని అంటావా. ఇంతవరకు మన ముగ్గురికి మాత్రమే తెలిసిన రహస్యం ఈ రోజు ని వలన అందరికి తెలిసింది "అని మళ్ళీ కొట్టబోతుంటే. శేఖర్, గట్టిగా "కాసేపు మీ గోలని అప్పండి "అని అంటాడు.
ఆ ఇంట్లో ఉన్నవారు కొన్ని గంటలు నిశబ్దంగా ఉండిపోతారు, ఎవరికి వారు మాట్లాడుకోకుండా ఎక్కడికక్కడ కూర్చుని ఉంటారు.
కొద్ది సమయం తరువాత
విష్ణు "అమ్మ ఆకలి "అంటూ తన అమ్మ వద్దకి వెళితే.
విష్ణు నాన్న శేఖర్ "ఇక నువ్వే, నేను అడవికి వెళ్లి తిరిగి రాకపోతే అమ్మ ని చూసుకునేది. ఇది మన సామర్థ్యం చాటు చెప్పుకునే సమయం, విష్ణు ఇలా రా "అని పిలుస్తాడు.
విష్ణు, శేఖర్ వద్దకి వెళ్లి
"నువ్వు ధైర్యంగా ఉండి అమ్మని చూసుకోవాలి, నేను రాకపోతే సిటీ లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వద్దకి వెళ్లి, అతని దగ్గర పని చేసి, అమ్మని బాగా చూసుకోవాలి;చూసుకుంటావ్ కదూ... అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు జాలిగా తన అమ్మ వైపు చూసి "సరే నాన్న "అని ప్రామిస్ చేస్తాడు.
లక్ష్మి కొన్ని కన్నీటి బొట్లు తన కంటి నుంచి కారుస్తుంది..................
శేఖర్, అడవిలోకి అవసరమైన సామాగ్రిని వెంటబెట్టుకుని, లక్ష్మి ఎదురు వస్తే, పెదాలపై చిరునవ్వు తో అడవిలోకి వెళ్తాడు.
విష్ణు విచారంగా చూస్తుంటాడు.
విష్ణు విచారం చూసిన లక్ష్మి.
"ఏమైంది కన్నా అలా ఉన్నావ్ "అని విష్ణు తల రాస్తు అడుగుతుంది.
అప్పుడు విష్ణు "నా వలనే కదా, నాన్న దూరం అవుతున్నాడు "అని అంటే.
"దూరం కాదు కన్నా, ఈ ఊరికి, ఈ ఒక సంఘటనతో అందరి గుండెలకి చాలా దగ్గర అవుతాడు,మీ నాన్న హీరో అవుతాడు వాళ్ళని కాపాడితే "అని అంటాది.
అప్పుడు విష్ణు పెదాలపై చిరునవ్వు తెచ్చుకుని, మొలవని మీసం తిప్పుకుని తన అమ్మని నవ్విస్తాడు.
అడవిలోపల
శేఖర్,అడవిలో తను వేసే ప్రతి అడుగుకి ఒక గుర్తుగా మేకుని చెట్టుకి గుచ్చి తాడు కట్టి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతుంటాడు.
గ్రామంలో
లక్ష్మి నీళ్లను బింది తో పట్టుకుంటుంటే, ఇరుగు పొరుగు వాళ్ళు లక్ష్మి కి ఉన్న ధైర్యం ని చూసి ఎగతాళి చేస్తారు,సూటి పోటి మాట్లను అంటుండడం గమనించిన విష్ణు కి ఒక ఆలోచన వస్తుంది.
శేఖర్ చెప్పిన సిటీలో ఉన్న వ్యక్తి ని కలవడానికి వెళ్తాను అని లక్ష్మిని ఒపించి బస్సు ఎక్కి బయలుదేరాతాడు.
అలా విష్ణు సిటీకి వెళ్లిన దగ్గర నుంచి లక్ష్మి ని గ్రామస్తులు ఈ విధముగా అంటుంటారు "ఎందుకు ని కొడుకుని సిటీకి పంపించావ్, ఈ అడవిలో ని భర్త పోరాడేది ఆరు పులిలతో కాని నీ కొడుకు చాలా మంది ని ఎదురుకోవాలి, ఇంత చిన్న వయసులో అంత సామర్థ్యం ఉందా మీ వాడికి "అని చీమ్మ గిల్లినట్లు గిల్లి అంటుంటారు. లక్ష్మి వాళ్ళ ముందు నవ్వుతూ సమాధానం ఇచ్చినా, లోపల మనసులో పట్టెడు దుఃఖం తో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటుంది.
అడవిలోపల
శేఖర్ అడుగులో అడుగు వేసుకుంటు ముందుకి వెళ్తుంటే ఒక పులి ఏదో తింటుండం గమనించి,అది మనిషిని తింటోందో లేదా వేరే జంతువుని తింటోందో తెలుసుకోవడానికి సంచిలోంచి కత్తి తీసి నెమ్మదిగా పులి వైపు వెళ్తుంటాడు.
సిటీలో
విష్ణు బస్సు నుంచి దిగి అడ్రస్ కనుకుంటుంటాడు,విష్ణుకి ఆకలి బాగా వేస్తుంటుంది. చుట్టు గమనిస్తాడు ఒక దగ్గర ఒక పిల్లోడు ఇడ్లిలు తినడం గమనించి, (తన వద్దకి వెళ్లి టిఫిన్ షాప్ ఎక్కడుందో కనుకుందాం అని తన వద్దకి వెళ్తుంటాడు.
అడవిలోపల
శేఖర్ పులి వద్దకి వెళ్లే సరికి ఒక మనిషి అరుపు వినిపిస్తుంది, అప్పుడు పులి వెంటనే ఆ స్థలం విడిచి ఆ అరుపు వినిపించిన దారిలో పరిగెడుతుంది. శేఖర్ భయంతో ముందుకి అడుగు వేసి చూస్తే అక్కడ ఒక మేక శవం ఉంటుంది. అప్పుడు శేఖర్ ఊపిరి పీల్చుకుని పులి వెళ్లిన మార్గంలో గుర్తులు పెట్టుకుంటూ పరుగులు తీస్తాడు.
సిటీలో
విష్ణు ఆ పిల్లోడికి వద్దకి వెళ్లి "ఈ టిఫిన్ నీకు ఎక్కడిది నాకు షాప్ చూపించు ఆకలిగా ఉంది" అనగానే. ఆ పిల్లోడు ఆ టిఫిన్ పొట్లం విష్ణుకి ఇచ్చి పరిగెడతాడు. విష్ణు ఆశ్చర్యం గా చూస్తున్న సమయంలో ఇంకో పిల్లోడు విష్ణు భుజంకీ ఉన్న సంచి లాక్కుని పరిగెడితుంటే. విష్ణు కూడా ఆ పిల్లోడి వెంట బడతాడు.
అడవిలోపల
శేఖర్ పులి వెళ్లిన మార్గంలో పరిగెడుతుంటే ఒక కోతి అడ్డం వచ్చి శేఖర్ చేతిలో ఉన్న కత్తి తీసుకుని ఇంకో మార్గంలో చెట్టుపైనుంచి ఎగురుతూ వెళ్తుంటే. శేఖర్ ఆ కోతి వెంట పరుగులు తీస్తుంటాడు,కోతి వద్ద ఉన్న తన ఖడ్గం తీసుకునేందుకు.
సిటీలో
విష్ణు ఒక పిల్లవాడి వెంట పరుగులు తీస్తుంటే,ఆ పిల్లోడు ఒక దగ్గర ఆగి ఇంక పరిగెత్తలేక విష్ణు దగ్గరకి రావడం చూసి తన చేతిలో ఉన్న సంచీని విష్ణు మీదకి విసిరి అట్టుగా వస్తున్న ఆటో ఎక్కి వెళిపోతాడు. విష్ణు ఆ సంచి పట్టుకుని, అందులో తను తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయో లేవో చూసుకుంటుండంగా ఒక అతను విష్ణు వద్దకి వచ్చి భుజం పై చెయ్యి వేసి "నువ్వు శేఖర్ కొడుకువి కదా, మీ నాన్న చెప్పాడు నువ్వు వస్తావని, ఇంతకీ నీకు ఎమ్ పని వచ్చు "అని హోటల్ లోపలికి తీసుకుని వెళ్తూ అంటాడు.
అప్పుడు విష్ణు "మీరు ఎమ్ చెప్పినా చేస్తా కాని నాకు రోజు కూలి ఇచ్చేయాలి "అని అంటే.
"నాకు ని పని నచ్చితే వారం రోజులకి సరిపడ డబ్బు ఇస్తా "అని అతను విష్ణు తో అంటాడు. విష్ణు పని చేయడం మొదలు పెడతాడు.
అడవిలో
శేఖర్,కోతి వెంట పడుతూ అలసి ఒక దగ్గర కుర్చుంటె.కోతి చెట్టు కి వేలాడుతూ శేఖర్ ని వెక్కిరిస్తుంటుంది.
శేఖర్ తెచ్చుకున్న తిండి కూడా అయిపోతుంది, చాలా నీరసంగా కోతి వెంట మళ్ళీ వెళ్తుంటాడు.
సిటీలో
విష్ణు పని చేసిన దగ్గర డబ్బు తీసుకుని ఇంటికి వెల్దామనుకుని బస్సు ఎక్కుతున్నప్పుడు ఒక పిల్లోడు విష్ణు చేతిలో ఉన్న డబ్బు లాక్కుని పారిపోతుంటె; విష్ణు పెద్ద పెద్దగా కేకలు వేస్తు వాడి వెంట పాడతాడు.
అడవిలో
శేఖర్ అలసి అలసి పెరిగెడుతుండడం చూసిన కోతి, శేఖర్ కత్తి ని ఒక దగ్గర శేఖర్ ఎదురుగా పాడేసి వెళిపోతుంది. అప్పుడు శేఖర్ ఆశ్చర్యం తో కూడిన ఆనందంతో ఆ ఖడ్గం తీసుకుని అట్టు గా ఎట్టుగా చూస్తాడు అప్పుడు శేఖర్ కి కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. ఆ విదేశీయులను చాటుగా వేటు వేద్దామని పులి కూడా వేచి చూస్తుండడం కూడా శేఖర్ గమనిస్తాడు.
సిటీలో
విష్ణు వెంబడిస్తున్న పిల్లోడు ఒక విదేశీయుల వాహనం తగిలి కిందపడితే విష్ణు వాడిని పట్టుకుని కొట్టి డబ్బు తీసుకున్నప్పుడు, ఆ విదేశీయులు విష్ణుని గుర్తు పట్టి "ని గ్రామానికి మేము తీసుకుని వెళ్తాము అని అనగా "సరే"అని విష్ణు అంటాడు.
విష్ణు విదేశీయుల వాహనంలో ఎక్కుతాడు.
అడవిలో
శేఖర్, విదేశీయులను కాపాడె మార్గం కనుక్కుoటాడు. పులి విదేశీయుల మీద దాడి చేసేటప్పుడు శేఖర్ ఒక చెట్టు ఊడ్లను దగ్గర చేసి, ఆ పులి పై దూకి తన ఖడ్గం తో ఆ పులి ని చంపేస్తాడు.
సమయం :8.30
గ్రామంలో
లక్ష్మి చాలా విచారంగా, దీనంగా, దీపాలు వెలిగిస్తు,దేవుడిని మనసారా కోరుకుంటు కళ్ళు మూసుకుంటుంది.
అప్పుడు ఒక కార్ హార్న్ పెద్దగా కొడుతూ ఒక కార్ వచ్చి గ్రామంలో ఆగుతుంది.
అప్పుడు ఆ కార్ లొంచి విష్ణు "అమ్మ "అంటూ పరిగెట్టుకుంటు వెళ్లి లక్ష్మి ని కౌగలించుకుని జరిగింది అంతా చెబుతాడు.
లక్ష్మి ఆ విదేశీయులకి దండం పెడుతుంది. విదేశీయులందరికి లక్ష్మి భోజనం పెడుతుంది. ఆ విదేశీయులు లక్ష్మిని "మా స్నేహితుల ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు.
కొద్ది సమయానికి అడవిలోంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తుంటాయి.
గ్రామస్తులతో పాటు లక్ష్మి, విష్ణు, విదేశీయులు బయటకి వచ్చి ఆ అరుపులు ఎక్కడినుంచో అని చూస్తుంటారు.
అప్పుడు ఒక పులి గాండ్రింపు గట్టిగా వినబడి, పులి పై కి ఎగురుకుంటూ వచ్చి గ్రామంలో దెబ్బలతో పడి ఉంటుంది. అప్పుడు గ్రామస్తులు భయంతో ఉంటుండంగా శేఖర్ పైకి ఎగిరి ఆ పులి కడుపులో కత్తితో పొడుస్తాడు. పులి చనిపోతుంది, విదేశీయులు తన స్నేహితులను కలుసుకుంటారు. శేఖర్ కి విదేశీయులు దండం పెడతారు, శేఖర్ కళ్ళు తిరిగి కింద పడతాడు.
అప్పుడు విదేశీయులలో ఒకడు "హాస్పిటల్ కి తీసుకుని వెల్దామ్ పదండి "అంటె. గ్రామస్తులు "ఈ గ్రామంలో హాస్పిటల్ లేదుగా"అని సమాధానం చెబుతారు.
విదేశీయులు ఒకరి వైపు ఒకరు చూసుకుని కార్ ఎక్కి వెళిపోతారు.
విష్ణు, లక్ష్మి, శేఖర్ ని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంటే,గ్రామస్తులంతా ప్రశంసలు చేస్తుంటారు. లక్ష్మి తలుపు మూస్తుంది.
లక్ష్మి, శేఖర్ కి సేవలు చేస్తుంటుంది.
కొన్ని నెలలు తరువాత
ఎప్పటిలాగే శేఖర్ అడవిలోకి దొంగగా వెళ్తుంటే. ఆ ఊరి పెద్ద మనిషి చూసి "ఇక నుంచి వేట కి ఉదయం వెళ్ళు, ఈ అడవి నీదే అంటాడు. అప్పుడు శేఖర్ పెదాలపై చిరునవ్వు వస్తుంది.
లక్ష్మిని వెక్కిరించినా వాళ్లంతా లక్ష్మి ని ఆదర్శంగా చేసుకోమని చెబుతుంటారు.
విష్ణు తో తోటి పిల్లలు ఆడుకోవడానికి తరలి వస్తుంటారు.
ఒకనాడు
విదేశీయులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఆ గ్రామం కి వచ్చి స్కూల్, రోడ్, హాస్పిటల్, వాటర్ ట్యాంక్ పెట్టించి వాటికి శేఖర్ పేర్లు పెడతారు.
ఆ ఒక సంఘటన, ఒక కుటుంబ జీవితంనే మార్చేసింది.
వాళ్ళు చేసిన సాయం వలన విదేశీయులు ఆ సాయం ని గుర్తించుకునందు వలన ఎందరో పిల్లలకి చదువుకునే అవకాశం కలిగింది,రోగులకు హాస్పిటల్ సదుపాయం, ఇంకా ఎన్నో ఫలితాలు ఆ గ్రామం కి ఒక కుటుంబం రాత్రి కుర్చుని ఆలోచించి నందు వలన కలిగింది.
శేఖర్ విష్ణుని పనిలోంచి మానిపించి స్కూలుకి పంపిస్తుంటాడు.
మోరల్ :ఈ కథలో ప్రతి పాత్ర మనకి నిజ జీవితంలో ఎదురవుతాయి. సాయం కోరుకునే వాళ్ళు, సాయం చేయడానికి భయపడే వాళ్ళు, సాయం చెయ్యదు అనే వాళ్ళు, నువ్వు వాళ్ళకి సాయం చేస్తే నీకు ఏమొస్తుంది అనే వాళ్ళు.
సాయం మార్పు ని కోరుతుంది. ఎప్పటికైనా చెడుగా సాయం చెయ్యదు అనుకునే వాళ్ళని కూడా మార్చేది సాయం కి సాయం మాత్రమే.