Kishore Dasika

Romance

5.0  

Kishore Dasika

Romance

రాశి నా రాక్షసి

రాశి నా రాక్షసి

3 mins
541


హాయ్ ,నా పేరు వేణు అండి.వయసు ఒక 24 ఏళ్ళు ఎసుకోండి .ఇది నా కథ ,చాలా అంటే చాలా సాధార్ణమైన కథ. 


నాకు పదహారేళ్లన్నప్పుడు అనుకుంట.ఒద్దు ,ఒద్దు అన్నా నాకు చీర్గర్ల్స్ డ్రెస్ వేసి స్టేజ్ మీదకి తోసేసారు.


స్టేజ్ అంటె; ఎదో అనుకోకండి ,ఆ రోజు మా స్కూల్ లో ఫెస్ట్ .అదెమిటో నేను స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరూ నన్ను చూసి క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారు .వాళ్ళ క్లాప్స్ విని నా డ్రెస్ ఊడిపోయింది.అప్పుడందరూ నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టారు ,నాకు సిగ్గు వేసి ఆ డ్రెస్ ని చేతితో పట్టుకుని టాయిలెట్ కి పరిగెడుతున్నప్పుడు రాయి తగిలి కింద పడ్డా,బాగా దెబ్బలు తగలడం వలన ఒక దగ్గర కుర్చుని ఏడవడం మొదలు పెట్టాను .కొద్ది నిమిషాలకి నా ఏడుపుకి ఇంకో ఆడ ఏడుపు తోడయ్యింది .'ఎవరా 'అని దగ్గరకి వెళ్లి చూస్తే "రాశి" నా రాక్షసి '.అప్పుడే తనని మొదటి సారి చూడడం .ఎందుకంటె ఆమె వేరే స్కూల్ ,మా టౌన్ లో ఉన్న అన్ని స్కూల్లు ,మా స్కూల్ తో జాయిన్ అయ్యి ఫెస్ట్ జరుపుకుంటున్నాయ్. 


రాశి ఒక అబ్బాయి డ్రెస్ వేసుకుని ,ఏడుస్తోంది .అప్పుడు నేను 'ఎమిటి పాప విశేషాలు 'అని అడిగా. అంతే,రాశి, కసుబుసు లాడుతూ, పాములా మీదకి వచ్చింది.అప్పుడు నాకు తన బాధ అర్ధమయ్యి "నా డ్రెస్ నువ్వు వేసుకో ,ని డ్రెస్ నేను వేసుకుంటా "అని ఐడియా చెప్పా.అప్పుడు తను 'ఒకే'అంది.ఆఫ్కోర్స్ వేణు ఐడియా చెబితే ఎవడు కాదంటారు చెప్పండి .మేమిద్దరం కళ్ళు మూసెసుకున్నాం,డ్రెసస్ అక్కడే వేసేసుకున్నాం .తప్పుగా అర్ధం చేసుకోకండి ,ఆమె లేడిస్ టాయిలెట్ కి వెళ్లి మార్చుకుంది .మరింక నేను జెంట్స్ టాయిలెట్ కి వెళ్లి బట్టలు మార్చుకుని, బయటకి వచ్చిన వెంటనే రాశి,'ఫ్రెండ్స్ 'అంటూ తన చేతితో నా చేతిని కలిపేసింది ,అంతటితో ఊరుకోకుండా నా చెయ్యి పట్టుకుని ఎవరికి కనబడకుండా స్కూల్ నుంచి నను,తనతో పాటు బయటకి తీసుకొచ్చి ఒద్దన్నా సరే 12 ఐస్క్రిమ్ లు తినిపించింది;డబ్బులు తనే కట్టిందనుకోండి.


కాని తరువాత రోజు చూడండి నా స్వామి రంగా.నా బాడీ టెంపరేచర్ ని నోట్లో తెర్మోమేటర్ పెట్టి మెజర్ చేసి,చూస్తె మీటర్ 104 కి చేరిందని డాక్టర్ చెప్పాడు.


సైకిల్ మిద రాశి ,మా ఇంటికి వచ్చేసింది .తనకి నా ఇల్లు ఎలా తెలుసు అని తనని చూసిన షాక్ లో అనుకున్న ,తరువాత ఆలోచిస్తే అర్ధమయింది. రాత్రి ఐస్క్రీమ్ తింటూ తనతో పులిహోర కలిపేసి, నా విషయాలు చెప్పేసా అని. 


ఇంతలో మా అమ్మ 'ఎవరు తిను 'అని అడిగింది. నేను 'ఫ్రెండ్ 'అన్నాను. అప్పుడు రాశి 'అంతకు మించి 'అని గట్టిగా అరిచింది. 

ఆ అరుపుకి నా జ్వరం దిగిపోయింది. 


ఎందుకో తెలియదు కాలక్రమేణ మేమిద్దరం 'ఇడియట్ ఫ్రెండ్స్' అయిపోయాం. 


రాశి అంత అల్లరి పిల్లని ఎక్కడా చూడలేదు, నేనే ఉత్సాహం అంటే నాకన్నా డబల్. 


మేమిద్దరం కలిసి మెలిసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చెరొక్క కంపెనీ లలో జాబ్స్ కూడా తెచ్చుకున్నాం. 


నేను జాబ్ ని బాగా బుద్ది మంతుడిలా చేసుకునే వాడిని, కాని ఈ రాక్షసి ఉంది చూసారు, అబ్బా ! జాయిన్ అయిన ఫైవ్ డేస్ కి వాళ్లతో గొడవ పెట్టుకుని మానేసి, నా వద్దకు వచ్చి "రాశి ఖాళి గా ఉంటే, వేణు జాబ్ చేస్తాడా? అని జాలిగా అడిగి నా జాబ్ కి కూడా మంగళహారతి పలికేది. 


ఇలా కొన్నాళ్లు జరుగుతూనే ఉంది, ఒకనాడు మేమిద్దరం ఒకే కంపెనీ లో జాయిన్ అవ్వడం చేసాం. అక్కడ మాత్రం తిన్నo గా ఉండేదా, గొడవలు స్టార్ట్ చెసేది. తనని చూసి నేను మొదలు పెట్టాను గొడవలు. దానితో ఆ కంపెనీ వాళ్ళు మా ఇద్దరిల్లలో కంప్లైంట్ చేసారు. దానితో మా ఇద్దరి అమ్మ, నాన్న, మా ఇద్దరి ని మూడు నెలలు కలవకుండా చేసారు. 


మూడు నెలలు తరువాత సడన్ గా రాశి ఒక పెళ్లి కార్డు పట్టుకుని నా దెగ్గరికి వచ్చింది. తనని ఆ పరిస్థితి లో చూసి కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. "చూసావ మన పేరెంట్స్, మనల్ని జీవితాంతం విడదీయాలని నీకు పెళ్లి చేస్తున్నారా "అని అన్నా. అప్పుడు రాశి నవ్వి "అవును చేస్తున్నారు, నీతొనే పెళ్లి రెడీగా ఉండు . నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేగా "అన్నాది. 


అప్పుడు ఏమైందో తెలియదు, వెంటనే రాశికి "లిప్ టూ లిప్" కిస్ పెటేసా. ఆ కిస్ కి ఫలితమే నా బేబీ కి, చిన్న బేబీ.మేము ముగ్గురమ్ అయాం. పెళ్లయ్యాక రాశి చాలా కుదురుగా ఉంది. నేను జాబ్ చేసుకుంటున్న, తను ఇంట్లో ఉండి పాపని చూసుకుంటోమిది. మా ఇద్దరి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, అంతా హ్యాపీ. 


రాశి అనే రాక్షసి నాజీవితంలో లేకపోతే, ఎంత బోరింగ్ గా గడిచెదో. 

థాంక్స్ టూ గాడ్ 


నా జీవితంలో, స్కూల్ ఫెస్ట్ లో పరిచయమైన రాశి, నిజంగా నా జీవితంలోకి ఫెస్టివల్ తెచ్చింది, దాని పేరు ఉష. ఈరోజు మా పాప పుట్టిన రోజు అందుకే ఈ వీడియో తీసుకుంటున్న, ఒకే బాయ్, ఇప్పటికే లేట్ అయింది అని తన చేతిలో ఉన్న కెమెరా రికార్డింగ్ బటన్ ని ఆఫ్ చేస్తాడు. 


జీవితంలో మనకి చాలా మంది పరిచయమవుతారు, కొంత మంది మనతో పాటు ఎంత దూరమైన వస్తారు, వాళ్ళని ఎప్పుడూ హ్యాపీ గా చూసుకోవడం మన బాధ్యత


Rate this content
Log in

Similar telugu story from Romance