కత్తి-కలం
కత్తి-కలం


అది అమావాస్య రాత్రి.....
ఉరుములు, మెరుపులతో వర్షం వస్తుంటుంది.
ఒక పెంకుటిల్లు నుంచి బయటకి ఒక 30 ఏళ్ళ అతను తన సైకిల్ వద్దకు వెళుతుంటే, ఒక చిన్న పిల్లవాడు
"మాస్టారు మీ కలం అండి "అంటూ మాస్టార్ వద్దకు వెళ్లి ఆ కలమును ఇస్తాడు. అప్పుడు ఆ మాస్టారు "కృతజ్ఞతలు "అని ఆ కలం ని జోబులో పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళుతుంటాడు.
మార్గం మధ్యలో తనకి తలనొప్పి వచ్చి ఒక 'టీ కొట్టు వద్ద ఆగి; టీ తాగుతుంటే. ఆ టీ కొట్టు సుబ్బు, "శంకర్ ఎలా ఉన్నావ్ ఇంత లేట్ అయిందేమిటి "అని అడుగుతాడు.
అప్పుడు శంకర్ "బడికి రాని విద్యార్థులకు ఈ రోజు జరిగిన పాఠం వాళ్ళ ఇళ్లకి వెళ్లి వివరించి వెళుతున్నప్పుడు, మీ కొట్టు దర్శనం ఇచ్చింది సైకిల్ ఆగింది, ఇంతకీ ని కొడుకు బాగా చదువుతున్నాడా "అని అడుగుతాడు.
అప్పుడు సుబ్బు "ఆ వాడికే ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నాడు ;శంకరా నిను ఎప్పటినుంచో ఒకటి అడగాలి అనుకుంటున్న, అడిగేస్తా మరి "
అని అంటే. అప్పుడు శంకర్ "ఏమిటో అడుగు "అని అంటాడు.
అప్పుడు సుబ్బు "ఏమి లేదు శంకర్, ని విద్యార్థులకు మొట్టమొదట మాట ఏమని చెబుతావ్ "అని అన్నప్పుడు శంకర్ "సాయం, మనిషికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం సాయం అని చెబుతా" అని సమాధానం ఇస్తుంటే ఒక తాగుబోతు అతను బాగా తాగి వీరిద్దరి దగ్గర కి వెళ్లి కత్తితో ఆ టీ కొట్టు అతనిని బెదిరిస్తూ, డబ్బుల డిబ్బీ పై చెయ్యి వేస్తె శంకర్ అడ్డుకుంటాడు. అప్పుడు ఆ తాగుబోతూ, శంకర్ ని పొడిచి, తోసి, ఆ టీ కొట్టు అతని చెయ్యి నరికి, గుండెల మీద తన్నితే అతను ఎగిరి పక్కనే ఉన్న పొలాలలో పడతాడు, శంకర్ కింద పడి ఆ నొప్పి ని ఓర్చుకుంటుంటే. తాగుబోతూ, ఆ డబ్బులు డిబ్బీ పట్టుకుని వెళుతుంటే. శంకర్ అతని కాళ్ళని పట్టుకుని లాగుతాడు, అతను కింద పడి, కోపంగా పైకి లేచి శంకర్ దగ్గర కి వెళ్లి, జుట్టు పట్టుకుని లేపి మరోసారి గుండెలలో తన దగ్గర ఉన్న కత్తి తో పొడుస్తాడు. ఆ తాకిడికి జోబులో ఉన్న కలం పైకి ఎగిరి కింద పడుతుంది.
శంకర్ కళ్ళలో ఉన్న కన్నీటి బొట్టు, వర్షం బొట్టు తో కలిసిన్నప్పుడు శంకర్ ప్రాణం వదులుతాడు.
తాగుబోతు ఆ డబ్బుల డిబ్బీ తీసుకుని కత్తిని
పైకి విసిరి శంకర్ సైకిల్ మీద తొక్కుకుంటు వెళిపోతాడు.
పైకి ఎగిరిన కత్తి, కలం పక్క పడుతుంది.
మరుసటి రోజు :
పోలీసులు ఆ ప్రదేశానికి వచ్చి టీ కొట్టు అతనిని విచారించి శంకర్ బాడీతో పాటు, సుబ్బు ని కూడా అంబులెన్స్ ఎక్కిస్తారు.
ఆ మార్గంలో డేంజర్ బోర్డులు పెడతారు, హంతకుడిని పట్టుకుని శిక్షలు విధిస్తారు.....
సుబ్బు చేతికి ఒక ఆర్టిఫిషల్ చెయ్యి అప్పు చేసి పెట్టించుకుంటాడు.
శంకర్ ఇంట్లో వాళ్లు, శంకర్ గుర్తు వచ్చిన్నప్పుడలా ఏడుస్తుంటారు.
కొన్ని నెలలకి
అదే మార్గంలో ఇద్దరి పిల్లలు
"ఒరేయ్ మన మాస్టార్ ని ఈ రోడ్ మీదే చంపేశారు అంట తెలుసా అని అంటే. ఇంకో పిల్లవాడు "అవును తెలుసు "అని మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఈ ఇద్దరి పిల్లలకు రెండు వస్తువులు కనబడతాయి.
అప్పుడు వారిద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని, పరుగు పోటీలో ఫస్ట్ ఎవరు ఆ వస్తువులో ఒక దానిని టచ్ చేస్తారో వాళ్లదే ఆ వస్తువు అని పరుగులు మొదలు పెడతారు.
వారిద్దరిలో ఒకరికి కలం, మరొకరికి కత్తి వాళ్ళ,వాళ్ళ చేతులలో పట్టుకుని ఒకరివైపు ఒకరు చూసుకుని.
"ఒరేయ్ నేను దీనితో, ఈ రోజు హోమ్ వర్క్ ఫాస్టుగా రాసేస్తా అని కలం చేతిలో ఉన్నవాడు అంటే.
ఈ కత్తిని ఇనుప సామాన్లు వాడికి ఇచ్చి, వాడు ఇచ్చిన డబ్బులతో పానీ పూరి తింటా అని చేతిలో కత్తి ఉన్నవాడు అంటాడు.
ఇద్దరూ చెరొక్క దారిలో వెళ్తారు.
కొన్ని సంవత్సరాలు తరువాత
ఆ ఇద్దరి పిల్లలలో కలం పట్టుకున్నవాడు లిటరేచర్ చదివి చాలా మందికి ఆదర్శవంతంగా ఉంటాడు.
కత్తి పట్టుకున్న వాడు, పాత ఇనుప వస్తువులను సేకరించి ఒక మ్యూజియం పెట్టి జాతీయ, అంతర్జాతీయ టూరిస్ట్ల జనాధార్ణ పొందుతాడు.
మనం ఉపయోగించుకునే వస్తువులను జాగ్రత్తగా అలోచించి, నలుగురి ప్రాణాలనైనా నిలపాలి లేదా నలుగురికి ఆ వస్తువు యొక్క ఉపయోగం తెలియజేసి ఆదర్శoగా నిలవాలి గాని ఆవేశంతో ఆ వస్తువును వాడకూడదు