STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

జీవితాన్ని మార్చిన e- మెయిల్

జీవితాన్ని మార్చిన e- మెయిల్

1 min
268

ప్రియమైన స్నేహకు,


    ఈరోజు కోసమే నువ్వు ఎన్నాళ్ళో ఎదురు చూశావనీ, చూస్తున్నావనీ తెలుసు. ఆ రోజు రానే వచ్చింది. 

    ఉప్పెన సృష్టించిన భీభత్సం వల్ల నీ తల్లిదండ్రులకు దూరమైన నువ్వు మాకు దొరికావు. ఈ ఆశ్రమానికీ, నీకూ ఏ బంధం ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఈ ఆశ్రమం అంటే నీకు ఎంతో అభిమానం.

    నీ తల్లిదండ్రుల వివరాలు దొరికాయి. అయితే నువ్వు వాళ్ళను కలిసే ముందు ఒక్క విషయం చెబుతాను.

    గడచిన కాలంలో వాళ్ళు నీ జీవితంలో ఎందుకు లేరో నీకు తెలుసు. ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నావని నాకు తెలుసు.

    ఇక నువ్వు ఆలోచించాల్సింది భవిష్యత్తులో వారితో నీకుండాల్సిన బాంధవ్యం.

    

    ఒక మంచి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తూ..

    

నువ్వు ముద్దుగా పిలిచే

నీ గురువు 


మెయిల్ చదువుతూ స్నేహ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

ఇప్పటి నుంచీ ఆమె జీవితం ముందులా ఉండదు. ఏం జరుగుతుంది అనే విషయం కన్నా, స్నేహ మళ్లీ 

తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ముందుకు నడిపిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract