వ్యక్తిత్వ స్పృహ - ఆత్మానుభవం
వ్యక్తిత్వ స్పృహ - ఆత్మానుభవం
చదవడం ఆత్మానుభవమే.
వ్రాయడం ఆత్మానుభవమే.
వ్యక్తిత్వ స్పృహ లేకుండా ఏ పని చేసినా, చేయకున్నా అది ఆత్మానుభవమే.
ఆత్మానుభవం ప్రత్యేకంగా కలిగేది కాదు. సదా ఉండేదే. అహంకార, మమకారములు, వ్యక్తిత్వ స్పృహ, సదా ఉండే ఆ అనుభవాన్ని అడ్డుతాయి. ఇవన్నీ మానసిక కార్యకలాపాలు.
మానసిక కార్యకలాపాలన్నీ ఆత్మానుభవం పై ఆనింపులు.
ఆ ఆనింపులను తొలగించుకోవడమే, తొలగించుకోవడానికే సాధన. తొలగించుకునే ప్రయత్నమే ధ్యానం.
న కర్మణా, న ప్రజయా, న ధనేన; త్యాగోనేనైవ అమృతమశ్నుతే - అంటే ఇదే అర్థం.
ఈశావాస్యమిదమ్ సర్వమ్
యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః
.........
అన్నా ఇదే తాత్పర్యం.
త్యాగము, త్యక్తేన పదాలు జగత్ ని దృష్టి నుంచి తప్పించాలని చెప్పే పదాలు.
జగత్ అంటే మానసిక కార్యకలాపాలు. జీవుడు అంటే వ్యక్తిత్వ స్పృహ. ఈ రెండూ కూడా ఆత్మానుభవం పైని ఆచ్ఛాదనలు. ఆ ఆచ్ఛాదనలను తొలగించుకునే ప్రయత్నమే త్యాగం, త్యక్తేన.
పొందవలసినది ఆత్మానుభవం కాదు. తొలగించుకోవలసినది వ్యక్తిత్వ స్పృహ.