Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్నేహం - జీవితం

స్నేహం - జీవితం

2 mins
522


ఏంట్రా బాబూ నువ్వు! బాబూ మధుకర్.. పలకవా ఇక..సర్లే. నేను సినిమాకన్నా పోతా. శ్రీనివాస్ చెప్పులు వేసుకుంటూ అన్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గది అది.


ఇప్పుడేమంటావ్ అయితే. నేను విన్నది నిజం కాదంటావా అన్నాడు మధుకర్.


అలా కాదురా. ఇప్పుడు నువ్వు ఎగ్జాం లో కాపీ కొట్టిన విషయం నేను పనిగట్టుకుని నిరంజన్ గాడికి చెప్పలేదు. రిజల్ట్స్ వచ్చాక అందరూ మార్కులు డిస్కస్ చేస్తుంటే కాపీ కొట్టిన వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చాయి అని ప్రసాద్ అంటే నేను సైలెంట్ గా నవ్వి ఊరుకున్నాను. అంతే.. అన్నాడు శ్రీనివాస్.


సైలెంట్ గా ఉంటే నేను తప్పు చేశానని నువ్వు ఒప్పుకున్నట్లు కదా. అది చాలదా వాడికి. ఇప్పుడు వాడు ఎలా వాగుతున్నాడో చూడు అని మధుకర్ గట్టిగా అన్నాడు.


మధూ! నేను అవునన్నా కాదన్నా నువ్వు కాపీ కొట్టడం తప్పని నీకే తెలుసు. ఆ టైమ్ లో నేను సైలెంట్ గా ఉండక, ఎవడు కాపీ కొట్టాడు అని డిస్కషన్ పెట్టి అందరి పేర్లూ లాగాలా. బుద్ధున్న వాడెవడైనా అలా చేస్తాడా? 


ఇక ఆ నిరంజన్ గాడి గురించి నీకు ముందే తెలుసు. లేనిది ఉన్నట్లు చెప్పడంలో PHD చేశాడు. నేను సైలెంట్ గా ఉన్నదానికి కొత్త అర్థాలు చెప్పి నీ బుర్ర తిన్నాడు. అంతే. 


ఏ బంధమైనా మూడో వ్యక్తి మాటల వల్ల ఈజీగా చెడిపోతుంది. నీకు నాతో ప్రాబ్లం ఉంటే నన్నే అడగాలి. అంతే గానీ వాడి మాటలు నమ్మి నువ్వు ఇలా అందరితో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అన్నాడు శ్రీనివాస్.


మధుకర్ కి తన తప్పేమిటో అర్థమైంది.


సారీ రా. నేనే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనూ ఉండగా నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు మధు.


ఓవర్ యాక్షన్ ఆపి, ముందు డబ్బులు తియ్యి. టికెట్స్ నువ్వే తియ్యాలి అన్నాడు శ్రీనివాస్. ఇందాక తీసా అన్నావ్ అన్నాడు మధు.


ఊరికే అలా అన్నారా. కొన్నాక రానంటే మళ్లీ అవి నేను ఎవరికో ఒకరికి అంటగట్టాలి అని శీను బైక్ స్టార్ట్ చేసాడు.


ద్రోహి అంటూ బైక్ ఎక్కి వెనుక కూర్చున్నాడు మధు.


అదేరా సినిమా పేరు అన్నాడు శ్రీనివాస్. బండి థియేటర్ వైపు వెళుతోంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract